ఇక ఆ దేశంలో సెల్‌ఫోన్లు నిషేధం... కఠిన ఆంక్షలు

సెల్ ఫోన్.. నేటి దైనందన జీవితంలో ఒక భాగం. అది చేతిలో ఉంటే.. ప్రపంచమంతా మన చేతుల్లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

Update: 2023-08-04 05:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : సెల్ ఫోన్.. నేటి దైనందన జీవితంలో ఒక భాగం. అది చేతిలో ఉంటే.. ప్రపంచమంతా మన చేతుల్లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ, సెల్ ఫోన్లు నేటి సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో స్మార్ట్ ఫోన్ వాడకం కూడా ఎక్కైవైంది. దీంతో వారు నిద్రలేమితో సతమవుతూ చిరు ప్రాయంలోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో వైద్యులు పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వొద్దంటూ సూచించారు.

ఈ క్రమంలో పొరుగు దైశం చైనాలో చిన్నారులు సెల్‌ఫోన్లు వాడకుండా చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించి ఆ దేశం సెల్‌ఫోన్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసి సరికొత్త నిబంధనలను రూపొందించింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే సెల్‌ఫోన్లను వినియోగించేందుకు అనుమతించారు. భవిష్యత్తు తరాలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అదేవిధంగా వయసుల వారీగా ఎవరెవరూ ఎంతసేపు సెల్ ఫోన్లను వాడాలో మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. 8 ఏళ్ల లోపు పిల్లలకు రోజుకు 40 నిమిషాలు, 8 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఒక గంట, 16 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు 2 గంటల సెల్‌ఫోన్‌ వినియోగించేందుకు అనుమతిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య 18 ఏళ్లలోపు వారికి ఎలాంటి స్మార్ట్‌ఫోన్ సేవలను అనుమతించరు.

18 ఏళ్లలోపు వారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య మొబైల్ పరికరాల్లో ఇంటర్నెట్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని సైబర్ బేస్ పేర్కొంది. పిల్లల వయస్సును ధృవీకరించే పరికరాన్ని కూడా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News