పాకిస్థాన్ చొరబాటుదారుడిని కాల్చి చంపిన బీఎస్ఎఫ్ దళాలు

పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం ఒక పాకిస్థానీ చొరబాటుదారుడిని కాల్చి చంపినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధికారి తెలిపారు.

Update: 2023-08-11 06:44 GMT

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం ఒక పాకిస్థానీ చొరబాటుదారుడిని కాల్చి చంపినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధికారి తెలిపారు. ఉదయం తేకలాన్ గ్రామ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా సరిహద్దు కాపలా దళాలు అతడిని గమనించాయని అధికారి తెలిపారు. ఈ క్రమంలో చొరబాటుదారుడు బీఎస్ఎప్ దళాలను సవాలు చేశాడు. అతను బార్డర్ క్రాస్ చేయకూడదని చెప్పినా వనకుండా ముందుకు సాగాడు. దీంతో బీఎస్ఎఫ్ సిబ్బంది చొరబాటుదారుడిపై కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Tags:    

Similar News