జానెడు జాగ కోసం పోరాడితే కాల్చేసిన్రు
దిశ, సూర్యాపేట: ముదిగొండ అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. మంగళవారం స్థానిక మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్ లో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముదిగొండ అమరవీరుల 13వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం పార్టీ, 119 ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహత్తర భూ పోరాటం జరిగిందన్నారు. 2007 సంవత్సరంలో […]
దిశ, సూర్యాపేట: ముదిగొండ అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. మంగళవారం స్థానిక మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్ లో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముదిగొండ అమరవీరుల 13వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం పార్టీ, 119 ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహత్తర భూ పోరాటం జరిగిందన్నారు.
2007 సంవత్సరంలో పేదలకు జానెడు జాగా కావాలని పోరాటం చేసిన ముదిగొండ అమరవీరులను అప్పటి కసాయి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుందన్నారు. అనంతరం ముదిగొండ అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరి రావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, సీపీఎం టూ టౌన్ కార్యదర్శి కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు మేఘన బోయిన శేఖర్, పట్టణ నాయకులు పచ్చి మట్టల పెంటయ్య పాల్గొన్నారు.