కోదాడలో నకిలీ కరోనా టెస్టులు

దిశ, కోదాడ: కోదాడ పట్టణంలో నకలీ ఆర్ఎంపీ మాయాజాలం బట్టబయలైంది. ఆయన వ్యవహారం పరిశీలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. అతను చదివింది పదో తరగతి మాత్రమే.. కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ లా ఆయన ప్రవర్తన ఉంటది. వివరాల్లోకి వెళితే.. కోదాడ పట్టణంలో ఓ వ్యక్తి క్లినిక్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు. గతకొన్నాళ్ల నుంచి ఈ క్లినిక్ ను నడుపుతున్నాడు. అయితే, తాజాగా తన మాయాజాలంతో కరోనా కాసులు సంపాదించుకునేందుకు ప్రయత్నించి బుక్కయ్యాడు. ఈ క్లినిక్ లో అతను […]

Update: 2020-08-01 01:27 GMT

దిశ, కోదాడ: కోదాడ పట్టణంలో నకలీ ఆర్ఎంపీ మాయాజాలం బట్టబయలైంది. ఆయన వ్యవహారం పరిశీలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. అతను చదివింది పదో తరగతి మాత్రమే.. కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ లా ఆయన ప్రవర్తన ఉంటది. వివరాల్లోకి వెళితే.. కోదాడ పట్టణంలో ఓ వ్యక్తి క్లినిక్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు. గతకొన్నాళ్ల నుంచి ఈ క్లినిక్ ను నడుపుతున్నాడు.

అయితే, తాజాగా తన మాయాజాలంతో కరోనా కాసులు సంపాదించుకునేందుకు ప్రయత్నించి బుక్కయ్యాడు. ఈ క్లినిక్ లో అతను నకలీ కరోనా టెస్టులు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం దిశ ప్రతినిధికి తెలియడంతో అతడి మాయాజాలం ఉదంతాన్ని బట్టబయలు చేశారు. ఈ విషయం తెలిసిన ప్రజలు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News