హై టెన్షన్ పోల్ ను ఢీకొట్టిన లారీ

దిశ, శేరిలింగంపల్లి: నిద్రమత్తులో టిప్పర్ లారీ డ్రైవర్ హై టెన్షన్ (220కేవీ) పోల్ ను ఢీకొట్టాడు. సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి రాఘవేంద్ర కాలనీలో ఈప్రమాదం చోటుచేసుకుంది. కొండాపూర్ నుండి రోబో సాండ్ తో మజీద్ బండ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ( ap 22 w 7623) హై టెన్షన్ పోల్ ను ఢీ కొట్టింది. ఈప్రమాదం అర్ధరాత్రి చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ట్రాన్స్ కో సిబ్బంది […]

Update: 2021-03-09 03:29 GMT

దిశ, శేరిలింగంపల్లి: నిద్రమత్తులో టిప్పర్ లారీ డ్రైవర్ హై టెన్షన్ (220కేవీ) పోల్ ను ఢీకొట్టాడు. సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి రాఘవేంద్ర కాలనీలో ఈప్రమాదం చోటుచేసుకుంది. కొండాపూర్ నుండి రోబో సాండ్ తో మజీద్ బండ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ( ap 22 w 7623) హై టెన్షన్ పోల్ ను ఢీ కొట్టింది. ఈప్రమాదం అర్ధరాత్రి చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ట్రాన్స్ కో సిబ్బంది వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని, నిద్రమత్తులో ఈప్రమాదం జరిగినట్లు గచ్చిబౌలి సీఐ సురేష్ వెల్లడించారు. ఈప్రమాదంలో హై టెన్షన్ స్థంభం పూర్తిగా నేలకొరిగింది. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్ కో ఎస్ ఈ రాంజీ మాలోత్ తెలిపారు. 220 కేవీ లైన్ పునరుద్ధరణకు మరో 10 రోజుల సమయం పడుతుందన్నారు. మూడు హైడ్రాలిక్ ల సహాయంతో పునరుద్దరణ చర్యలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ కో అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News