మనీలాండరింగ్ కేసులో లలిత్ గోయల్ అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్ : రియల్ ఎస్టేట్ గ్రూప్ IREO వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ గోయల్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. ED లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు గోయల్‌ను అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం అదుపులోకి తీసుకొని ప్రశ్ని్ంచారు. రిమాండ్ కోసం స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. గోయల్ భారతీయ జనతా పార్టీ నాయకుడు సుధాన్షు […]
దిశ, వెబ్‌డెస్క్ : రియల్ ఎస్టేట్ గ్రూప్ IREO వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ గోయల్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. ED లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు గోయల్‌ను అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం అదుపులోకి తీసుకొని ప్రశ్ని్ంచారు. రిమాండ్ కోసం స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. గోయల్ భారతీయ జనతా పార్టీ నాయకుడు సుధాన్షు మిట్టల్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యాపారవేత్త. కొన్ని ఆఫ్‌షోర్ సంస్థలకు $77 మిలియన్ల విలువైన గృహ కొనుగోలుదారుల నిధులు, పెట్టుబడులు, షేర్‌హోల్డింగ్‌లను మళ్లించడంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ED అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గోయల్ IREO మోసం చేసిందని ఆరోపిస్తూ అనేక మంది గృహ కొనుగోలుదారులు కోర్టును ఆశ్రయించారు. ఆ సంస్థ 2018-19 ఆర్థిక నివేదికల ప్రకారం IREO రూ.500 కోట్ల మేరకు నష్టాల్లో ఉంది. ఆఫ్‌షోర్ ఫండ్స్‌పై గ్లోబల్ ‘పండోర’ పేపర్స్ లీక్‌లో గోయెల్ పేరు కూడా వచ్చింది. గోయల్ అతని బృందం భారతీయ చట్టాలను ఉల్లంఘించి ఎటువంటి నిధులను విదేశాలకు మళ్లించలేదని పేర్కొన్నారు.