మంచు లక్ష్మి, సామ్.. ‘గ్రో విత్ మి’
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని వారి కోడలు సమంత.. లాక్‌డౌన్ టైమ్‌లోనూ చాలా బిజీగా ఉన్నారు. గార్డెనింగ్‌తో సరికొత్త జర్నీ స్టార్ట్ చేసిన సామ్.. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సులభమవుతుందని చెబుతోంది. ఈ ఏడాది ఇంటి ఆవరణలో పండించిన కూరగాయలనే ఆహారంగా తీసుకోవడం ఉత్తమమని తెలిపిన సామ్.. ఇంట్లో కొద్దిపాటి ఖాళీ స్థలమున్నా మొక్కలు పెంచుకోవచ్చని సెలవిస్తోంది. దీని వల్ల ఆరోగ్యంతో పాటు ఆహారం లభిస్తుందన్న సమంత అక్కినేని.. ‘గ్రో విత్ మి’ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. […]
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని వారి కోడలు సమంత.. లాక్‌డౌన్ టైమ్‌లోనూ చాలా బిజీగా ఉన్నారు. గార్డెనింగ్‌తో సరికొత్త జర్నీ స్టార్ట్ చేసిన సామ్.. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సులభమవుతుందని చెబుతోంది. ఈ ఏడాది ఇంటి ఆవరణలో పండించిన కూరగాయలనే ఆహారంగా తీసుకోవడం ఉత్తమమని తెలిపిన సామ్.. ఇంట్లో కొద్దిపాటి ఖాళీ స్థలమున్నా మొక్కలు పెంచుకోవచ్చని సెలవిస్తోంది. దీని వల్ల ఆరోగ్యంతో పాటు ఆహారం లభిస్తుందన్న సమంత అక్కినేని.. ‘గ్రో విత్ మి’ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది. సొంత ఆహారాన్ని పండించడమంటే సొంత డబ్బు ప్రింట్ చేయడమేనన్న సామ్.. ఇందుకోసం మంచు లక్ష్మీ ప్రసన్న, రకుల్ ప్రీత్ సింగ్‌ను నామినేట్ చేసింది.
కాగా, ఈ చాలెంజ్ స్వీకరించిన మంచు లక్ష్మి.. తన కూతురితో కలిసి ‘గ్రో విత్ మి’ చాలెంజ్ పూర్తి చేశారు. విన్నితో కలిసి మొక్కలు నాటిన లక్ష్మి.. సొంత ఆహారాన్ని పండించేందుకు కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. మొక్కలు మనకు చాలా రకాలుగా ప్రయోజనం చేకూరుస్తాయని.. ఆక్సిజన్‌తో పాటు ఆహార వనరులను అందిస్తాయని చెప్పింది. కరోనా మహమ్మారి ఆరోగ్యకరమైన జీవనాన్ని నేర్పిందన్న లక్ష్మి.. మనం జీవితంలో చాలా విషయాలు లేకుండా జీవించవచ్చు కానీ, ఆహారం లేకుండా మాత్రం బతకలేమన్నారు. సొంత ఆహారాన్ని పండించుకుంటున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. మీరు కూడా ‘గ్రో విత్ మి’ జర్నీలో భాగస్వాములు అవ్వండని పిలుపునిచ్చింది.