లగడపాటి మళ్లీ జోస్యం

దిశ, వెబ్‌డెస్క్: సర్వేలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. సర్వేలు తన హాబీ అని చెప్పుకునే లగడపాటి.. గత తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై వెల్లడించిన సర్వే ఫలితాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో సర్వేలకు కూడా గుడ్‌బై చెప్పిన లగడపాటి.. తాజాగా మరోసారి రాజకీయ జోస్యం చెప్పారు. జగన్ పాలన ఎలా ఉందో మూడేళ్ల తర్వాత తెలుస్తుందని, రాజకీయాల కంటే ముందు […]

Update: 2021-03-10 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: సర్వేలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. సర్వేలు తన హాబీ అని చెప్పుకునే లగడపాటి.. గత తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై వెల్లడించిన సర్వే ఫలితాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో సర్వేలకు కూడా గుడ్‌బై చెప్పిన లగడపాటి.. తాజాగా మరోసారి రాజకీయ జోస్యం చెప్పారు.

జగన్ పాలన ఎలా ఉందో మూడేళ్ల తర్వాత తెలుస్తుందని, రాజకీయాల కంటే ముందు నుంచే జగన్‌తో స్నేహం ఉందన్నారు. పవన్ ఓడినా ప్రజల్లో ఉండటం అభినందనీయమని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానన్న వాగ్ధానానికి కట్టుబడి ఉన్నానన్నారు. రాజకీయ సర్వేలకు దూరంగానే ఉన్నానని లగడపాటి చెప్పారు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా.. ఇవాళ విజయవాడలో లగడపాటి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మీడియా ప్రశ్నించగా.. పై విధంగా స్పందించారు.

Tags:    

Similar News