రాసలీలల యువతి హైదరాబాద్‌లో మకాం?
దిశ, వెబ్‌డెస్క్ : ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని లొంగదీసున్న మంత్రి ఉదాంతం కర్ణాటకలో సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి, యువతి రాసలీలల వీడియోలు మీడియాకు లీక్ కావడంతో రాజకీయ వర్గాల్లో దేశవ్యాప్తంగా ప్రకంపనలు చెలరేగాయి. ఈ ఘటన నాటి నుంచి ఆ యువతి, కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి బంధువులు సైతం ఇళ్లను విడిచి వెళ్లారు. ఆమె ఆచూకీ కోసం కర్ణాటక పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శనివారం ఆమె అజ్ఞాతం నుంచే తనకు ప్రాణహాని […]
దిశ, వెబ్‌డెస్క్ : ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని లొంగదీసున్న మంత్రి ఉదాంతం కర్ణాటకలో సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి, యువతి రాసలీలల వీడియోలు మీడియాకు లీక్ కావడంతో రాజకీయ వర్గాల్లో దేశవ్యాప్తంగా ప్రకంపనలు చెలరేగాయి. ఈ ఘటన నాటి నుంచి ఆ యువతి, కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి బంధువులు సైతం ఇళ్లను విడిచి వెళ్లారు. ఆమె ఆచూకీ కోసం కర్ణాటక పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
శనివారం ఆమె అజ్ఞాతం నుంచే తనకు ప్రాణహాని ఉందని, తనతోపాటు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. అయితే ఈ కేసులో ఆమె కీలకంగా మారడంతో విచారణకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. దీనిలో భాగంగా ఆమె అద్దెకు ఉంటున్న ఇంటితోపాటు విజయపుర జిల్లా నిడగుందినిలో ఆ యువతి స్వగ్రామం గుర్తించి ఆయా ఇండ్లకు నోటీసులు అతికించారు. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ కోసం పోలీసులు బెంగళూరు ఆర్‌టీ నగర్‌తోపాటు గోవాలోనూ గాలింపులు చేపట్టారు. అయితే ఆ ప్రాంతాల్లో కాకుండా యువతి హైదరాబాద్ సేఫ్ ప్రాంతంగా భావించి ఇక్కడే మకాం వేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నట్లు పక్కా సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. నేడు లేదా రేపు సిట్ బృందం హైదరాబాద్ రానున్నట్లు సమాచారం.
సారీ.. నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు..
సదరు యువతి నాలుగు రోజుల క్రితం ఇంటి ఓనర్‌కు ఫోన్ చేసిందని సమాచారం. ‘‘సారీ అంకుల్.. నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. క్షమించండి. నేను తర్వలోనే వచ్చి ఇంటిని ఖాళీ చేస్తాను’’. అని అన్నట్లు తెలిసింది. నోటీసులు ఇవ్వడానికి ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులకు ఇంటి యజమాని ఆ యువతి చివరి సారిగా ఫోన్ చేసిన విషయం చెప్పినట్లు తెలిసింది.