ఓ అధికారిణికి ఫోన్‌లో ఆకతాయి వేధింపులు

దిశ, హైదరాబాద్‌: ఓ జిల్లా అధికారిణికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడి వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని, వాట్సా‌ప్‌లో నగ్నచిత్రాలు పంపాలని బెదిరిస్తున్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో తన నగ్నచిత్రాలు, వీడియోలను ఆమె వాట్సాప్‌ నంబర్‌కు పంపాడు. ఆ ఉన్మాది వికృత చేష్టలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆమె హైదరాబాద్‌ శివారులోని ఓ జిల్లాలో కీలకమైన విభాగంలో అధికారిణిగా పనిచేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఆమె నివసిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో […]

Update: 2020-02-24 00:09 GMT

దిశ, హైదరాబాద్‌: ఓ జిల్లా అధికారిణికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడి వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని, వాట్సా‌ప్‌లో నగ్నచిత్రాలు పంపాలని బెదిరిస్తున్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో తన నగ్నచిత్రాలు, వీడియోలను ఆమె వాట్సాప్‌ నంబర్‌కు పంపాడు. ఆ ఉన్మాది వికృత చేష్టలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆమె హైదరాబాద్‌ శివారులోని ఓ జిల్లాలో కీలకమైన విభాగంలో అధికారిణిగా పనిచేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఆమె నివసిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఒక నంబర్‌ నుంచి ఆమె ఫోన్‌కు కాల్‌ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడు. ప్రభుత్వ ఉద్యోగి కావడం, కీలక పదవిలో ఉండటంతో ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు జంకారు. కొద్ది రోజుల తర్వాత మూడు వేర్వేరు నంబర్ల నుంచి ఆ వ్యక్తి ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడు. నగ్నచిత్రాలు, వీడియోలు పంపించకపోతే ఇంకా వేధింపులకు గురిచేస్తానని బెదిరించాడు. తాను చెన్నైలో ఉంటానని, హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రయాణ ఖర్చులు రూ.2 వేలు పంపాలని బ్యాంక్‌ ఖాతా వివరాలను ఆమెకు మెసేజ్‌ చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె తన భర్తతో కలిసి ఆమె రాచకొండ సైబర్‌ ఠాణాలో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఐపీసీ 354డీ, 506 ఐపీసీ సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67, 67ఏ సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read also..

నిర్మల్‌ ‘పట్టణ ప్రగతి’లో మంత్రి అల్లోల

Full View

Tags:    

Similar News