నీకు డబ్బులిచ్చేది అందుకేగా.. హీరోకు క్లాస్ పీకిన ఫ్యాన్
దిశ, సినిమా : హీరో కిచ్చా సుదీప్ ప్రస్తుతం కన్నడ ‘బిగ్ బాస్ సీజన్ 8’తో బిజీగా ఉన్నారు. ఆయన హోస్టింగ్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండగా.. ఈ సీజన్ సూపర్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. అయినా సరే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 12 మంది సభ్యులు చేసే పనులకు చిర్రెత్తిపోయిన ఓ బిగ్ బాస్ లేడీ ఫ్యాన్.. హోస్ట్ సుదీప్‌కు సలహా ఇస్తూ ట్వీట్ చేసింది. హానెస్ట్ గర్ల్ (HONEST GIRL) పేరుతో ఉన్న ఈ […]
దిశ, సినిమా : హీరో కిచ్చా సుదీప్ ప్రస్తుతం కన్నడ ‘బిగ్ బాస్ సీజన్ 8’తో బిజీగా ఉన్నారు. ఆయన హోస్టింగ్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండగా.. ఈ సీజన్ సూపర్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. అయినా సరే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న 12 మంది సభ్యులు చేసే పనులకు చిర్రెత్తిపోయిన ఓ బిగ్ బాస్ లేడీ ఫ్యాన్.. హోస్ట్ సుదీప్‌కు సలహా ఇస్తూ ట్వీట్ చేసింది. హానెస్ట్ గర్ల్ (HONEST GIRL) పేరుతో ఉన్న ఈ ట్విట్టర్ హ్యాండిల్లో సుదీప్‌కు కాస్త ఘాటుగానే సజెషన్ ఇచ్చింది.
This week #Sudeep should give class like #SalmanKhan
Not his routine styleHelbeku anisthu ab lab lab
I hate this dialogueYou have to say what is right and wrong as host
You are paid for that only— ❤HONEST GIRL❤ (@BiggBossAddict) April 29, 2021
హిందీ బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ మాదిరిగా సుదీప్ కూడా కంటెస్టెంట్లకు క్లాస్ ఇవ్వాలని సూచించింది. రొటీన్ స్టైల్‌ను ఫాలో కాకుండా ఈ వీక్‌లో కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. రొటీన్ డైలాగ్‌తో బోర్ కొడుతోందని.. హోస్ట్‌గా ఏది తప్పో ఏది ఒప్పో చెప్పే బాధ్యత తనదే కదా అని తెలిపింది. సుదీప్‌కు డబ్బులు(రెమ్యునరేషన్) ఇచ్చేది కూడా అందుకే కదా అని ట్వీట్ చేసింది.