బోయిన్‌పల్లి మార్కెట్‌కు ట్రాఫిక్ బెడద..
దిశ, కంటోన్మెంట్ : నగరంలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును కొద్ది రోజులుగా ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తోంది. రైతులు, వ్యాపారులు, హమాలీలు, వినియోగదారులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఈ మార్కెట్‌లో మౌలిక వసతులను కల్పించారు. మార్కెట్లో కూరగాయల లావాదేవీల విషయమై రైతులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో క్రమేణా వాహనాల రద్దీ పెరుగుతున్నది. వచ్చిపోయే వారితో రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్ర తరమవుతోంది. బోయిన్‌పల్లి మార్కెట్‌కు వివిధ రాష్ట్రాలు, […]
దిశ, కంటోన్మెంట్ :
నగరంలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును కొద్ది రోజులుగా ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తోంది. రైతులు, వ్యాపారులు, హమాలీలు, వినియోగదారులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఈ మార్కెట్‌లో మౌలిక వసతులను కల్పించారు. మార్కెట్లో కూరగాయల లావాదేవీల విషయమై రైతులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో క్రమేణా వాహనాల రద్దీ పెరుగుతున్నది. వచ్చిపోయే వారితో రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్య తీవ్ర తరమవుతోంది.
బోయిన్‌పల్లి మార్కెట్‌కు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. ఇందుకు భారీ వాహనాలు వినియోగిస్తారు. ఈ వాహనాల్లో కూరగాయాలను దించి, మార్కెట్‌లోని పార్కింగ్ స్థలంలో నిలుపాల్సి ఉండగా అవేవీ పట్టించుకోవడం లేదు. సమీప జిల్లాల నుంచి కూడా ఆటోలు, ఇతర చిన్నపాటి వాహనాల్లో కూరగాయలను ఇక్కడికి తీసుకువస్తుంటారు. ఈ వాహనాలు కూడా అడ్డదిడ్డంగా పార్క్ చేస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు మార్కెట్ నుంచి కూరగాయలను కొనుగోలు చేసి నగరంలోని రైతుబజార్లు, రిటైల్ మార్కెట్లకు తరలించే ప్యాసింజర్ ఆటోల కారణంగా సమస్య మరింత జటిలమవుతున్నది. ఇక మార్కెట్లోకి ప్రవేశించేందుకు వెలుపలకు వెళ్లడానికి ద్వారాలు వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా ఒకే చోట ఉన్నాయి.
హమాలీలకు తప్పని తిప్పలు..
ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా మూటలు మోసే హమాలీలకు తిప్పలు తప్పడం లేదు. మార్కెట్‌కు అనుకున్న సమయానికే వచ్చినప్పటికీ ట్రాఫిక్ సమస్య కారణంగా వాహనాల్లోని కూరగాయాలను దించడానికి అవుతున్నదని, తమకు గిట్టుబాటు ధరలు లభించడంలేదని పలువురు రైతులు వాపోతున్నారు. సమస్యపై అధ్యయనం చేసి, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయడానికి గతంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, కమీషన్ ఏజెంట్లు, అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులతో కూడుకున్న ఓ కమిటీని నియమించారు. వాహనాల రాకపోకలను నియంత్రించలేని పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఐనప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికైనా మార్కెటింగ్ అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.