డ్రెస్సింగ్ లేకుండా సలాడ్ వడ్డించారు

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కోవిడ్ -19 యావత్ ప్రపంచాన్నే గజగజ వణికిస్తోన్నది. దానిని కట్టడి చేయాలన్న ఉద్ధేశ్యంతో ఆయా దేశాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కువైట్ లో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చిన పలువురిని ఓ ఫైవ్ స్టార్ లో కొన్ని రోజులపాటు ఉంచారు. ముందు జాగ్రత్తలో భాగంగా వారికి ఆ హోటల్ లో ఆశ్రయం కల్పించారు. అయితే.. వారిలో కొందరు వ్యక్తులు అక్కడి […]

Update: 2020-04-08 09:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం కోవిడ్ -19 యావత్ ప్రపంచాన్నే గజగజ వణికిస్తోన్నది. దానిని కట్టడి చేయాలన్న ఉద్ధేశ్యంతో ఆయా దేశాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కువైట్ లో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చిన పలువురిని ఓ ఫైవ్ స్టార్ లో కొన్ని రోజులపాటు ఉంచారు. ముందు జాగ్రత్తలో భాగంగా వారికి ఆ హోటల్ లో ఆశ్రయం కల్పించారు. అయితే.. వారిలో కొందరు వ్యక్తులు అక్కడి ప్రభుత్వానికి ఇంటర్నెట్ ద్వారా మెసెజ్ లు, మెయిల్స్, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఫిర్యాదు చేశారు. అవేమిటంటే.. తమకు వడ్డించే మాంసంలో కొవ్వు ఎక్కువగా ఉందని, ఈ హోటల్ లో వడ్డించే వారు ఆలస్యంగా వడ్డిస్తున్నారని, డ్రెస్సింగ్ లేకుండా సలాడ్ వడ్డించారని ఇలా పలు రకాలుగా ఆ వ్యక్తులు కంప్లైంట్ చేస్తున్నారు. వీటన్నంటినీ పరిశీలించిన అక్కడి అధికారులు.. ప్రస్తుతమున్న క్లిష్ట సమయంలో ఇలా వ్యవహరించడం సరికాదని, ఈ విధంగా ఫిర్యాదు చేసినవారిపై కఠిన చర్యలు ఉంటాయని చెబున్నారు.

Tags: Kuwait, Citizens, Hotels, Compliance, Officials

Tags:    

Similar News