SEBI: సెబీ ఛైర్మన్‌గా తుహిన్ కాంత పాండె మొదటి బోర్డు మీటింగ్‌లో కీలక ప్రతిపాదనలు

ఎఫ్‌పీఐ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 25,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు.

Update: 2025-03-24 15:30 GMT
SEBI: సెబీ ఛైర్మన్‌గా తుహిన్ కాంత పాండె మొదటి బోర్డు మీటింగ్‌లో కీలక ప్రతిపాదనలు
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త చైర్‌పర్సన్ తుహిన్ కాంత పాండే ఆధ్వర్యంలో సోమవారం జరిగిన తొలి బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమర్థవంతమైన, అనుకూలమైన నిబంధనలు, మరింత పారదర్శకత, ఈజ్ ఆఫ్ డూయింగ్ లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. బోర్డు మీటింగ్‌లో తీసుకున్న కీలక అంశాలను పరిశీలిస్తే.. భారత మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 25,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. అలాగే, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల(ఏఐఎఫ్) నిబంధనలను కూడా సడలించింది. 'ఏ' లేదా అంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలల్ని పెట్టుబడులు ఇప్పుడు అన్‌లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌లుగా పరిగణించనున్నారు. షేర్‌హోల్డర్ల ఆమోదం లేకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్‌లను(పీఐడీ) నియమించవచ్చని సెబీ తెలిపింది. దీనికి సెబీ ఆమోదం తప్పనిసరి. అదేవిధంగా కీ మేనేజ్‌మెంట్ పర్సనల్(సీఓ, సీఆర్ఐఓ, సీటీఓ, సీఐఎస్ఓ) నియామకం, పునఃనియామకం, తొలగింపు విషయంలో పాలక మండి ఆమోదం అవసరం. ప్రధానంగా ఇటీవల సెబీ చుట్టూ నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా బోర్డు సభ్యులు, సీనియర్ అధికారులకు సంబంధించి సమగ్ర సమీక్షను చేపట్టేందుకు ఉన్నత స్థాయి కమిటీ (హెచ్ఎల్‌సీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బోర్డు సభ్యుల ఆస్తి, పెట్టుబడులు, బాధ్యతలపై కమిటీ సమగ్రంగా సమీక్షను నిర్వహిస్తుంది. ఈ సమగ్ర పరిశీలన సబీ ఛైర్‌పర్సన్‌కు కూడా వర్తిస్తుంది. 

Tags:    

Similar News