FPIs: ఆరు రోజుల్లో రూ. 31 వేల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు

ఎఫ్‌పీఐలు తిరిగి భారత మార్కెట్లపై నమ్మకాన్ని కొనసాగించడంతో నిఫ్టీ ఈ ఆరు రోజుల్లో 6 శాతం రికవరీని సాధించింది.

Update: 2025-03-30 10:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లు ఆకర్షణీయమైన వాల్యూయేషన్‌లో ఉండటం, దేశ కరెన్సీ రూపాయి విలువ బలపడటం, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీని ఫలితంగా గత ఆరు సెషన్‌లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దాదాపు రూ. 31,000 కోట్ల విలువైన నిధులను భారత ఈక్విటీల్లోకి పంపారు. ఎఫ్‌పీఐలు తిరిగి భారత మార్కెట్లపై నమ్మకాన్ని కొనసాగించడంతో నిఫ్టీ ఈ ఆరు రోజుల్లో 6 శాతం రికవరీని సాధించింది. డిపాజిటరీ గణంకాల ప్రకారం, ఈ ఆరు సెషన్లలో వచ్చిన నిధుల కారణంగా మొత్తంగా మార్చి నెలలో ఎఫ్‌పీఐలు రూ. 3,973 కోట్లను మాత్రమే వెనక్కి తీసుకెళ్లగలిగారు. ఈ ఏడాది జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లను ఎఫ్‌పీఐలు నిధులను ఉపసంహరించుకున్నారు. దీంతో పోలిస్తే మార్చిలో అతి తక్కువ మొత్తం వెనక్కి వెళ్లడం భారత ఈక్విటీలకు భారీ ఊరటగా భావించవచ్చు. మార్చి 21-28 తేదీల మధ్య ఎఫ్‌పీఐలు రూ. 30,927 కోట్లను మన మార్కెట్లలో ఉంచారు. అయితే, తాజా నిధుల రాక ఏప్రిల్ 2న అమెరికా ప్రభుత్వం నిర్దేశించిన ప్రతీకార సుంకాలపై ఆధారపడి ఉండనుంది. టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండకపోతే ఈ ర్యాలీ కొనసాగుతుందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ తెలిపారు. 

Tags:    

Similar News