ప్లాస్టిక్ నిర్మూలనకు.. బీచ్‌లో వినూత్న నిరసన
దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలోని ‘బాలి’ దీవి.. ప్రకృతి రమణీయతకు, కనువిందైన బీచ్‌లకు నెలవు. ఒకప్పుడు అత్యంత పరిశుభ్రంగా ఉండే ఇక్కడి బీచ్‌లు.. ప్రస్తుతం డంప్ యార్డులను తలపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏటా వర్షాకాలంలో సముద్రగర్భంలోని ప్లాస్టిక్ వ్యర్థాలు తీరానికి కొట్టుకు వస్తుండటంతో.. అందమైన తీరాలు ప్లాస్టిక్ చెత్తతో నిండిపోతున్నాయి. ఈ దృశ్యాలతో కలతచెందిన బెల్జియంకు చెందిన ఓషియన్ అడ్వకేట్, ప్రకృతి ప్రేమికురాలు అయిన లారా వినూత్న నిరసన చేపట్టింది. బీచ్‌లతో ప్రసిద్ధి చెందిన బాలి ద్వీపానికి […]
దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలోని ‘బాలి’ దీవి.. ప్రకృతి రమణీయతకు, కనువిందైన బీచ్‌లకు నెలవు. ఒకప్పుడు అత్యంత పరిశుభ్రంగా ఉండే ఇక్కడి బీచ్‌లు.. ప్రస్తుతం డంప్ యార్డులను తలపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏటా వర్షాకాలంలో సముద్రగర్భంలోని ప్లాస్టిక్ వ్యర్థాలు తీరానికి కొట్టుకు వస్తుండటంతో.. అందమైన తీరాలు ప్లాస్టిక్ చెత్తతో నిండిపోతున్నాయి. ఈ దృశ్యాలతో కలతచెందిన బెల్జియంకు చెందిన ఓషియన్ అడ్వకేట్, ప్రకృతి ప్రేమికురాలు అయిన లారా వినూత్న నిరసన చేపట్టింది.
బీచ్‌లతో ప్రసిద్ధి చెందిన బాలి ద్వీపానికి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుండగా, పర్యాటక ఆకర్షణగా నిలిచే అక్కడి సముద్ర తీరాలన్నీ కూడా ‘ప్లాస్టిక్ వ్యర్థాల’తో నిండిపోతున్నాయి. దాంతో 2017లోనే బాలిలోని కొన్ని బీచ్‌లలో ‘చెత్త ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. ఆ తర్వాత 2018లో బ్రిటిష్ డైవర్ రిచ్ హార్నర్.. బాలి సమీపంలోని నుసా పెనిడా వద్ద గల సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతగా సముద్ర జీవాల ఉనికిని దెబ్బతీస్తున్నాయో తెలియజేసేందుకు ఓ వీడియో తీసి ప్రపంచానికి చూపించాడు. ఈ రెండు చర్యల వల్ల ఎటువంటి లాభం జరగలేదు. ఇక తాజాగా అక్కడి కుటాలోని బీచ్‌లలో ప్లాస్టిక్‌తో పాటు, ఇతర వ్యర్థాలు కుప్పలుతెప్పలుగా కనిపించాయి. కాగా ప్రకృతికి, సముద్ర జీవులకు అపారనష్టం కలిగిస్తున్న ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన లారా.. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదనే నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో ఆ చెత్త మధ్యలోనే ‘సాగరకన్య (మెర్మైడ్)లా మారి, బాలికి చెందిన ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ వయన్ సాయంతో ఫొటోషూట్ చేసింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్‌గా మారాయి. దాంతో పర్యావరణ ప్రేమికులతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా బాలి బీచ్‌లను శుభ్రం చేసేందుకు కదిలారు.
‘ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అసలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీనే ఆపాలి. ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసినా గానీ ఇండోనేషియా వ్యాప్తంగా ఇప్పటికీ ప్లాస్టిక్ సాచెట్స్, వాటర్ కప్స్ విరివిగా వాడుతున్నారు. కొకోకోలా, పెప్సీ, యూనిలివర్, నెస్లే వంటి సంస్థలు ఇప్పటికైనా దీనిపై ఆలోచన చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ప్రకృతిని సంరక్షించుకోవడం అందరి బాధ్యత, అందరూ సహకరిస్తేనే.. ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది’ అని లారా అభిప్రాయపడింది.
ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కాలువలు, చెరువులు, నదులతో పాటు సముద్ర గర్భాలు, భూగర్భ జలాలు కూడా కాలుష్యం బారిన పడుతున్నట్లు ఎన్నో అధ్యయనాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాల్ని కలుషితం చేస్తుండగా.. సముద్ర గర్భంలో దాదాపు 14 మిలియన్ టన్నుల(కోటి 40 లక్షల టన్నులు) మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనికి వ్యతిరేకంగా ఎంతోమంది పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు పోరాడుతున్నా.. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయకపోవడం గమనార్హం.
category : lifestyle
slug : Kuta Beach ‘mermaid’ speaks about viral protest over single-use plastics
tags : mermaid, laura, protest, kuta beach, ban single use plastic, bali beaches, dumpyard of beach