బతుకుదెరువుకు వచ్చి విగతజీవిగా..

బతుకుదెవురు కోసం సొంతూరును విడిచి, రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిన ఓ యువకుడిని విధి వంచించింది. అనుమానస్పదంగా అదృశ్యమై ఓ చెరువులో శవమై తేలాడు. వివరాల్లోకి వెళ్లితే.. కర్నూల్ జిల్లాకు చెందిన ఓబులేసు (28) కొన్నేళ్ల క్రితం మెదక్ జిల్లాకు వలసొచ్చి, పట్టణ కేంద్రంలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అయితే, ఈ నెల 12నుంచి అతను కనిపించకుండా పోయాడు. మెదక్‌లోనే ఉండే అతని అన్న.. ఓబులేసు కోసం పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం […]

Update: 2020-02-16 03:49 GMT

బతుకుదెవురు కోసం సొంతూరును విడిచి, రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిన ఓ యువకుడిని విధి వంచించింది. అనుమానస్పదంగా అదృశ్యమై ఓ చెరువులో శవమై తేలాడు. వివరాల్లోకి వెళ్లితే.. కర్నూల్ జిల్లాకు చెందిన ఓబులేసు (28) కొన్నేళ్ల క్రితం మెదక్ జిల్లాకు వలసొచ్చి, పట్టణ కేంద్రంలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అయితే, ఈ నెల 12నుంచి అతను కనిపించకుండా పోయాడు. మెదక్‌లోనే ఉండే అతని అన్న.. ఓబులేసు కోసం పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం పట్టణ శివారులోని పిట్లం చెరువులో శవమై తేలాడు. అయితే, ఓబులేసు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు మెదక్ టౌన్ సీఐ వెంకట్ తెలిపారు.

Tags:    

Similar News