కర్నూలు కిమ్స్‌కి నర్స్ డే నాడు ప్రతిష్ఠాత్మక సర్టిఫికేట్

దిశ ఏపీ బ్యూరో: క‌ర్నూలు జిల్లాలోని కిమ్స్ ఆసుపత్రికి ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం (నర్స్ డే) రోజున ప్రతిష్ఠాత్మక హైమ్ ఇంటర్నేషనల్ గుర్తింపు లభించడం విశేషం. హైమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఆసుపత్రుల్లోని వివిధ అంశాలను పూర్తిగా పరిశీలించి, వివిధ విభాగాల్లో సర్టిఫికేట్లు ఇస్తుంది. కిమ్స్‌కి ఆరోగ్య సేవల విభాగంలో గుడ్ హైజీన్ ప్రాక్సీసెస్ సర్టిఫికేట్ బహూకరించింది. క‌ర్నూలు జొహ‌రాపురం రోడ్డులో ఉన్న కిమ్స్ ఆసుప‌త్రిలో సిబ్బంది రోగుల ఆరోగ్య‌ర‌క్ష‌ణ‌తో పాటు ప‌రిశుభ్ర‌త‌కు కూడా పెద్ద‌పీట వేశార‌ని, అంత‌ర్జాతీయ […]

Update: 2020-05-12 01:59 GMT

దిశ ఏపీ బ్యూరో: క‌ర్నూలు జిల్లాలోని కిమ్స్ ఆసుపత్రికి ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం (నర్స్ డే) రోజున ప్రతిష్ఠాత్మక హైమ్ ఇంటర్నేషనల్ గుర్తింపు లభించడం విశేషం. హైమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఆసుపత్రుల్లోని వివిధ అంశాలను పూర్తిగా పరిశీలించి, వివిధ విభాగాల్లో సర్టిఫికేట్లు ఇస్తుంది. కిమ్స్‌కి ఆరోగ్య సేవల విభాగంలో గుడ్ హైజీన్ ప్రాక్సీసెస్ సర్టిఫికేట్ బహూకరించింది.

క‌ర్నూలు జొహ‌రాపురం రోడ్డులో ఉన్న కిమ్స్ ఆసుప‌త్రిలో సిబ్బంది రోగుల ఆరోగ్య‌ర‌క్ష‌ణ‌తో పాటు ప‌రిశుభ్ర‌త‌కు కూడా పెద్ద‌పీట వేశార‌ని, అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా వారి పనితీరు ఉంద‌ని హైమ్ సంస్థ అభిప్రాయపడింది. అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించిన తరువాత, కిమ్స్‌కి అర్హత ఉందని నిర్ధారించి ఈ సర్టిఫికేట్ అందజేసినట్టు హైమ్ సంస్థ తెలిపింది.

కరోనా వైరస్ విస్త‌రిస్తున్న నేపథ్యంలో ప‌రిశుభ్ర‌త చాలా ముఖ్య‌మ‌ని హైమ్ సంస్థ తెలిపింది. కిమ్స్‌లోని ఐసీయూ, వార్డులను వీడియో కాల్స్ ద్వారా పరిశీలించి, వైద్యులు, సిబ్బంది, రోగులను విచారించిన తరువాతే కిమ్స్‌కి ఈ సర్టిఫికేట్ ఇచ్చామని తెలిపారు. దీనిపై కర్నూల్ కిమ్స్ ఆస్పత్రి సెంటర్ హెడ్ జీ.రంజిత్ హర్షం వ్యక్తం చేశారు. తాము అనుసరించే ప్రమాణాలన్నిటినీ హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ గుర్తించి ఈ గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ సర్టిఫికెట్‌ ఇవ్వడం గర్వకారణమని అన్నారు.

Tags:    

Similar News