స్విగ్గీ, జొమాటోతో ఒప్పందం చేసుకున్నాం: కన్నబాబు

రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయలు, పండ్ల సరఫరాకు స్విగ్గీ, జొమాటో కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ, లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. విత్తనాల కోసం క్యూలో నిలబడే అవకాశం లేకుండా గ్రామస్థాయిలోనే సచివాలయ సిబ్బందితో పంపినీ చేయిస్తామని చెప్పారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కర్రపెండ్లం, కర్నూలులో ఉల్లి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో […]

Update: 2020-05-04 07:33 GMT

రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయలు, పండ్ల సరఫరాకు స్విగ్గీ, జొమాటో కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ, లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. విత్తనాల కోసం క్యూలో నిలబడే అవకాశం లేకుండా గ్రామస్థాయిలోనే సచివాలయ సిబ్బందితో పంపినీ చేయిస్తామని చెప్పారు. తడిచిన ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కర్రపెండ్లం, కర్నూలులో ఉల్లి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రాగులు కొనుగోలుకు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు.

Tags: agriculture, ysrcp, kurasala kannababu, kakinada

Tags:    

Similar News