‘దిశ’ ఎఫెక్ట్.. పాలేరు పాత కాలువలో వ్యర్థాల తొలగింపు
దిశ, పాలేరు : కాలువ చివరి రైతులకు అందని సాగునీరు.. రైతులు ఆందోళన బాటపట్టే అవకాశం ఉందని ‘దిశ’అందించిన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం కాలువలో పేరుకుపోయిన నాచు, వ్యర్థాలను కూలీలను ఏర్పాటు చేసి తొలగించారు. ఇటీవల పాలేరు పాత కాలువ గేట్లు మొరాయించడంతో నీటి సామర్థ్యం తగ్గించే పరిస్థితి లేక సిల్ట్, నాచు వల్ల కాలువ పొంగి, గండ్లు పడి రైతుల పొలాలు నీట మునిగాయి. దీనితో ఇరిగేషన్ ఈఈ సమ్మిరెడ్డి పరివేక్షణలో డీఈలు మన్మధరావు, […]
దిశ, పాలేరు : కాలువ చివరి రైతులకు అందని సాగునీరు.. రైతులు ఆందోళన బాటపట్టే అవకాశం ఉందని ‘దిశ’అందించిన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం కాలువలో పేరుకుపోయిన నాచు, వ్యర్థాలను కూలీలను ఏర్పాటు చేసి తొలగించారు. ఇటీవల పాలేరు పాత కాలువ గేట్లు మొరాయించడంతో నీటి సామర్థ్యం తగ్గించే పరిస్థితి లేక సిల్ట్, నాచు వల్ల కాలువ పొంగి, గండ్లు పడి రైతుల పొలాలు నీట మునిగాయి. దీనితో ఇరిగేషన్ ఈఈ సమ్మిరెడ్డి పరివేక్షణలో డీఈలు మన్మధరావు, రత్నకుమారి, జేఈలతో కలిసి పాలేరు పాత కాలువను పరిశీలించారు.
పాలేరు జలాశయం నీటి మట్టం 19 అడుగులు ఉంది. రిజర్వాయర్ మరో 2 అడుగులు మేర తగ్గితే తప్పా గేట్లను సరిచేసే అవకాశం లేనందున ఈరోజు ఎట్టకేలకు సిల్ట్‌ను తొలగించే పనులను ప్రారంభించారు. సీజన్‌కు ముందే కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో అధికారుల అలసత్వం వల్లే కాలువ చివరి రైతులకు నీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సిల్ట్ తొలగించే పనులు వేగిరంగా చేయాలని రైతులు కోరుకుంటున్నారు. వీరి బాధలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన దిశకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.