ఉన్నావ్ కేసు: కుల్దీప్ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష
ఉన్నావ్ కేసు బాధితురాలి తండ్రి హత్య కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడించింది. బాధితురాలి తండ్రి లాకప్ డెత్ కేసులో ఇటీవల సెంగార్‌ను దోషిగా ఢిల్లీ కోర్టు తేల్చింది. బాధితురాలి కుటుంబానికి సెంగార్‌తో పాటు అతని సోదరుడు చెరి రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మరో ఆరుగురు దోషులకు కూడా పదేళ్ల పాటు శిక్షను […]
ఉన్నావ్ కేసు బాధితురాలి తండ్రి హత్య కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడించింది. బాధితురాలి తండ్రి లాకప్ డెత్ కేసులో ఇటీవల సెంగార్‌ను దోషిగా ఢిల్లీ కోర్టు తేల్చింది. బాధితురాలి కుటుంబానికి సెంగార్‌తో పాటు అతని సోదరుడు చెరి రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మరో ఆరుగురు దోషులకు కూడా పదేళ్ల పాటు శిక్షను విధిస్తూ తీస్ హజారీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తీర్పు వెల్లడించారు. కాగా, 2017 ఉన్నావ్ హత్యాచార కేసులో కుల్డీప్ సెంగార్‌కు ఇప్పటికే జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.
Tags: unnao case, kuldeep sengar, delhi court