ప్రెగ్నెంట్ ఉమెన్ ఫోన్ కాల్.. డెలివరీ చేసిన పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా, లాక్‌డౌన్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసుల సేవలు చిరస్మరణీయం. లాక్‌డౌన్ నిబంధనల్లోనూ మానవత్వంతో ముందుకొస్తున్నారు. ఇటువంటి ఘటనలు చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ ప్రెగ్నెంట్ ఉమెన్‌కి సరైన సమయానికి మెడిసిన్ అందించారు కూకట్‌పల్లి పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని భాగ్యనగర్‌ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌కి అత్యవసరంగా టాబ్లెట్లు కావాలని కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది.. […]

Update: 2021-06-19 00:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా, లాక్‌డౌన్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసుల సేవలు చిరస్మరణీయం. లాక్‌డౌన్ నిబంధనల్లోనూ మానవత్వంతో ముందుకొస్తున్నారు. ఇటువంటి ఘటనలు చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ ప్రెగ్నెంట్ ఉమెన్‌కి సరైన సమయానికి మెడిసిన్ అందించారు కూకట్‌పల్లి పోలీసులు.

పూర్తి వివరాల్లోకి వెళితే..

కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని భాగ్యనగర్‌ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌కి అత్యవసరంగా టాబ్లెట్లు కావాలని కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది.. మెడికల్ షాప్‌కి వెళి టాబ్లెట్లు తీసుకున్నారు. అనంతరం స్వయంగా పెట్రోలింగ్ వాహనంలో డోర్ డెలివరీ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో‌ను కూకట్‌పల్లి పోలీసులు ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News