సైబర్ నేరగాళ్ల సవాల్.. ఏకంగా పోలీసులకే టోకరా

దిశ, కూకట్ పల్లి: ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరువైంది. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త అని అవగాహన కల్పించే వారి అకౌంటే హ్యాక్ కు గురైంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి చెందిన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ అకౌంట్ ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. కూకట్ పల్లి పీఎస్ సైబరాబాద్ పేరుతో ఫేస్ బుక్ లో ఉన్న అకౌంట్ నుండి 20 వేల రూపాయలు డబ్బులు కావాలని పోస్ట్ పెట్టారు. ఈ […]

Update: 2021-04-20 00:33 GMT

దిశ, కూకట్ పల్లి: ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరువైంది. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త అని అవగాహన కల్పించే వారి అకౌంటే హ్యాక్ కు గురైంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి చెందిన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ అకౌంట్ ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. కూకట్ పల్లి పీఎస్ సైబరాబాద్ పేరుతో ఫేస్ బుక్ లో ఉన్న అకౌంట్ నుండి 20 వేల రూపాయలు డబ్బులు కావాలని పోస్ట్ పెట్టారు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించి వెంటనే ప్రజలను అప్రమత్తం చేశారు. కూకట్ పల్లి పీఎస్ సైబరాబాద్ పేరుతో ఫేస్ బుక్ లో ఉన్న అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని, వారు అడిగిన డబ్బు ఎవరు పంపవద్దని కోరారు. ఆ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను కూడా పోలీసులు విడుదల చేశారు. త్వరలోనే ఆ సైబర్ నేరగాళ్ళను పట్టుకొంటామని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల అకౌంట్నే హ్యాకర్లు హ్యాక్ చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సైబరాబాద్ పోలీసులకు సైతం హ్యాకర్లు సవాల్ విసిరినట్టు అందరు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News