మీరా-తారక్ ఫ్యాన్స్ వార్.. స్పందించిన కేటీఆర్
మీరా చోప్రా, తారక్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ సోషల్ మీడియాలో హోరెత్తింది. యాసిడ్ అటాక్ , గ్యాంగ్ రేప్ బెదిరింపులకు పాల్పడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. తన తల్లిదండ్రులు చనిపోవాలంటూ మెస్సేజ్‌లు చేస్తూ వేధించారని మీరా చోప్రా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, హైదరాబాద్ సిటీ పోలీస్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించి ఎన్సీడబ్లూ చైర్మన్ రేఖా ప్రకాశ్.. హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ కేసును హ్యాండిల్ చేయాలని ఆదేశించింది. అయితే తర్వాత మీరా […]
మీరా చోప్రా, తారక్ ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ సోషల్ మీడియాలో హోరెత్తింది. యాసిడ్ అటాక్ , గ్యాంగ్ రేప్ బెదిరింపులకు పాల్పడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. తన తల్లిదండ్రులు చనిపోవాలంటూ మెస్సేజ్‌లు చేస్తూ వేధించారని మీరా చోప్రా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, హైదరాబాద్ సిటీ పోలీస్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించి ఎన్సీడబ్లూ చైర్మన్ రేఖా ప్రకాశ్.. హైదరాబాద్ సిటీ పోలీస్ ఈ కేసును హ్యాండిల్ చేయాలని ఆదేశించింది.
అయితే తర్వాత మీరా తారక్ ఫ్యాన్స్ మెసేజ్‌ల స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్, కవితలను కూడా ట్విట్టర్‌లో ట్యాగ్ చేయగా.. దీనిపై స్పందించారు కేటీఆర్. మేడమ్ తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ సీపీని ఈ కేసు గురించి త్వరితగతిన యాక్షన్ తీసుకోవాలని చెప్పామన్నారు. మీ కంప్లైంట్ ఆధారంగా చర్యలు తీసుకుంటారని ట్విట్టర్‌లో తెలిపారు. దీనిపై థాంక్స్ చెప్పిన మీరా.. మహిళా సంరక్షణ ముఖ్యమని తెలిపింది. ఇలాంటి క్రిమినల్స్‌ను వదిలేయకూడదని, ఖచ్చితంగా శిక్షించాలని కోరింది.
Thanks sir, it really means a lot. This is very important for women safety. These people should not be left free to do crimes on women! 🙏🙏 https://t.co/HzQcRHPEAd
— meera chopra (@MeerraChopra) June 5, 2020