బరోడా కెప్టెన్సీని వదిలేసిన కృనాల్ పాండ్యా
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బరోడా రంజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కృనాల్ పాండ్యా ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) అధ్యక్షుడు అమిన్‌కు పాండ్యా తన రాజీనామాను మెయిల్ చేసినట్లు సమాచారం. కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఆటగాడిగా మాత్రం జట్టుతో పాటు కొనసాగుతానని కృనాల్ ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే కెప్టెన్సీని ఎందుకు వదులుకున్నాడో మాత్రం […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బరోడా రంజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కృనాల్ పాండ్యా ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) అధ్యక్షుడు అమిన్‌కు పాండ్యా తన రాజీనామాను మెయిల్ చేసినట్లు సమాచారం. కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఆటగాడిగా మాత్రం జట్టుతో పాటు కొనసాగుతానని కృనాల్ ఆ లేఖలో పేర్కొన్నాడు.
అయితే కెప్టెన్సీని ఎందుకు వదులుకున్నాడో మాత్రం చెప్పలేదు. కాగా, కృనాల్ పాండ్యా ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బరోడా సెలెక్టర్లు తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏక పక్షంగా జట్టును ఎంపిక చేసినందుకు బాధపడినట్లు తెలుస్తున్నది. బరోడా జట్టుకు అవసరమైన ప్లేయర్లను ఇవ్వకపోవడం వల్లే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేయాల్సి వచ్చిందని పాండ్యా భావిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన పాండ్యా కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. కాగా, ఇటీవల పాండ్యా సరైన ఫామ్‌లో లేకపోవడంతో టీ20 వరల్డ్ కప్ సహా, న్యూజీలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు.