ఆగస్టు 27న కేఆర్ఎంబీ కీలక సమావేశం

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా నది యాజమాన్య బోర్డు 14వ సమావేశం ఈ నెల 27వ తేదీన నిర్వహించాలని సభ్య కార్యదర్శి నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రెండు రాష్ట్రాల సాగునీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం పంపించారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన 14 అంశాలతో ఎజెండాను ఖరారు చేశారు. ప్రస్తుత సాగునీటి సంవత్స (2021 జూన్ మొదలు 2022 మే వరకు)రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిఫ్టీ-ఫిఫ్టీ నిష్పత్తిలో రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాలను వాడుకోవాలంటూ […]

Update: 2021-08-16 11:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా నది యాజమాన్య బోర్డు 14వ సమావేశం ఈ నెల 27వ తేదీన నిర్వహించాలని సభ్య కార్యదర్శి నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా రెండు రాష్ట్రాల సాగునీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం పంపించారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన 14 అంశాలతో ఎజెండాను ఖరారు చేశారు. ప్రస్తుత సాగునీటి సంవత్స (2021 జూన్ మొదలు 2022 మే వరకు)రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిఫ్టీ-ఫిఫ్టీ నిష్పత్తిలో రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాలను వాడుకోవాలంటూ పంపిన ప్రతిపాదనపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. కేఆర్ఎంబీ సమావేశం జరిగే రోజునే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ కూడా జరగనున్నది. ఈ నెల 9వ తేదీన ఫుల్ బోర్డు సమావేశానికి కేవలం ఈ కారణాన్నే సాకుగా చూపి తెలంగాణ సాగునీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఎగ్గొట్టారు. ఈ నెల 27న జరిగే సమావేశానికైనా హాజరవుతారా లేదా అనే అనుమానం లేకపోలేదు.

కృష్ణా బోర్డుకు రెండు రాష్ట్రాలూ ఒక ఆర్థిక సంవత్సరానికి సరిపోయేంత బడ్జెట్ విడుదలతో పాటు రిజర్వు ఫండ్‌గా చెరి రూ. 10 కోట్ల చొప్పున ఇచ్చే అంశంపైనా చర్చ జరగనున్నది. నీటి విడుదలకు సంబంధించి ఇప్పటివరకూ అవలంబించిన ఫార్ములా, అదనంగా వినియోగించుకున్న నీటిని ఇకపైన కేటాయింపుల్లో మినహాయించడం, వరద రూపంలో వచ్చే మిగులు జలాలను ఏ విధంగా వాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌కు అనుగుణంగా కేఆర్ఎంబీ పరిధిపై చర్చ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, శ్రీశైలం డ్యామ్‌లో విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం, కేఆర్ఎంబీ హెడ్ క్వార్టర్‌ను విశాఖపట్నానికి తరలించడం తదితర పలు అంశాలపై ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించనున్నట్లు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి ఆ లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News