విజయవాడను వణికిస్తున్న లారీ డ్రైవర్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తెలంగాణను దాటేశాయి. ఎన్నడూ నమోదు కాని శ్రీకాకుళం జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. కృష్ణా జిల్లా కరోనా కేసుల్లో మూడో స్థానంలో నిలిచింది. విజయవాడ వన్‌టౌన్ వెళ్లాలంటే అంతా భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కృష్ణలంకకు చెందిన లారీ డ్రైవర్ విజయవాడకు దడపుట్టిస్తున్నాడు. కోల్‌కతాకు వెళ్లొచ్చిన కృష్ణలంక లారీ డ్రైవర్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఆయన విచ్చలవిడిగా తిరగడంతో ఆయన ద్వారా మరో […]

Update: 2020-04-25 06:54 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తెలంగాణను దాటేశాయి. ఎన్నడూ నమోదు కాని శ్రీకాకుళం జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. కృష్ణా జిల్లా కరోనా కేసుల్లో మూడో స్థానంలో నిలిచింది. విజయవాడ వన్‌టౌన్ వెళ్లాలంటే అంతా భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కృష్ణలంకకు చెందిన లారీ డ్రైవర్ విజయవాడకు దడపుట్టిస్తున్నాడు.

కోల్‌కతాకు వెళ్లొచ్చిన కృష్ణలంక లారీ డ్రైవర్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఆయన విచ్చలవిడిగా తిరగడంతో ఆయన ద్వారా మరో 8 మందికి కరోనా పాజిటివ్ నమోదైంది. ఈ క్రమంలో ఈ రోజు కృష్ణా జిల్లాలో కొత్తగా నమోదైన 25 కేసుల్లో 18 కేసులు కృష్టలంకలోనే నమోదు కావడంతో ఆ ప్రాంత వాసులంతా భయాందోళనలకు గురవుతున్నారు.

దీంతో, కృష్ణలంకను వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పోలీసు అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించి, హై అలెర్ట్ జారీ చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో పటిష్ఠంగా పహారా కాస్తున్నారు. ఈ ప్రాంతంలో అనుమానితులను హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. కరోనా లక్షణాలేవైనా కనిపిస్తే వెంటనే వైద్యశాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

tags: krishna district, vijayawada, krishna lanka, corona virus, covid-19, redzone, red alert

Tags:    

Similar News