ఐటీ కంపెనీలకు కలిసొచ్చే కాలం

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 (Kovid-19) సంక్షోభం కారణంగా ఐటీ రంగం (IT sector) భారీగా దెబ్బతింది. అయితే, కరోనా తర్వాతి పరిస్థితులు ఐటీ రంగానికి బాగా కలిసొచ్చేలా ఉంది. కరోనా అనంతర పరిణామాలతో క్లయింట్ల ఐటీ ఖర్చులు (Clients’ IT costs) భారీగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. దీనివల్ల దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ (Infosys, TCS) సంస్థలకు ప్రయోజనకరం అవుతాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ (Kotak Institutional Equities) వెల్లడించింది. అలాగే, ఔట్ సోర్సింగ్ […]

Update: 2020-08-30 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 (Kovid-19) సంక్షోభం కారణంగా ఐటీ రంగం (IT sector) భారీగా దెబ్బతింది. అయితే, కరోనా తర్వాతి పరిస్థితులు ఐటీ రంగానికి బాగా కలిసొచ్చేలా ఉంది. కరోనా అనంతర పరిణామాలతో క్లయింట్ల ఐటీ ఖర్చులు (Clients’ IT costs) భారీగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. దీనివల్ల దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ (Infosys, TCS) సంస్థలకు ప్రయోజనకరం అవుతాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ (Kotak Institutional Equities) వెల్లడించింది.

అలాగే, ఔట్ సోర్సింగ్ ఐటీ సేవలు కూడా పెరుగుతాయని భావిస్తోంది. ఔట్ సోర్సింగ్ ఐటీ సేవలు (Outsourcing IT services) ఏకంగా 6 నుంచి 8 శాతం వరకు పెరుగుతాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ (Kotak Institutional Equities)నివేదిక అంచనా వేసింది. అనేక కంపెనీలు కొత్త వ్యాపారంలో ప్రవేశించడం, పరిస్థితులకు తగిన నూతన సామర్థ్యాలకు అనుగుణంగా ఖర్చులు పెరిగినట్టు గుర్తించామని నివేదిక పేర్కొంది.

గ్లోబల్ రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి ఐటీ సేవలు 6 నుంచి 8 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఇది గత పదేళ్ల కాలంలో కేవలం 4 శాతం మేర పెరుగుదలను నమోదు చేసింది కాబట్టి 6 నుంచి 8 శాతం పెరుగుదల అనేది చాలా ఎక్కువని గార్ట్‌నర్ (Gartner) నివేదిక భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీలకు డిమాండ్ ఇదివరకటి కంటే ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడింది.

ఈ డిమాండ్ ముఖ్యంగా దేశీయ దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్‌ (Infosys, TCS)లకు ఉపయోగపడనుంది. ఔట్ సోర్సింగ్ అందిస్తున్న కంపెనీలు వాటి కంపెనీల సామర్థ్యం, నిర్వహణ సామర్థ్యం సహా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. తద్వారా ఇన్ఫోసిస్ తర్వాత విప్రో, హెచ్‌సీఎల్‌లు కూడా ఈ అవకాశాలను అందుకోవచ్చు.

ఇప్పటికే ఐటీ కంపెనీలు ఎక్కువ శాతం తమ వినియోగదారులకు డిజిటల్ సేవలను అందించడానికి గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి క్లౌడ్ హైపర్ సేవలందించే వారితో కొనసాగుతున్నాయి. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ క్లయింట్లకు ఆటంకాలు ఏర్పడకుండా ఈ క్లౌడ్ సేవలను ఉపయోగపడుతున్నాయి. ఈ పరిణామాలతో ఐటీ కంపెనీలు అనేక ప్రయోజనాలను పొందుతాయని గార్ట్‌నర్ నివేదిక చెబుతోంది.

Tags:    

Similar News