యూత్‌కు బన్నీ, కొరటాల స్ట్రాంగ్ మెసేజ్
దిశ, వెబ్‌డెస్క్ : డైరెక్టర్ కొరటాల శివ తన సినిమాల ద్వారా సోషల్ మెసేజ్ ఇచ్చేందుకు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తుంటాడు. ‘మిర్చి, శ్రీమంతుడు, భరత్ అను నేను, జనతా గ్యారేజ్’ లాంటి సినిమాల ద్వారా ప్రకృతి పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, తోటి మనుషులను ప్రేమించడం, ఆపదొస్తే అండగా నిలవడం లాంటి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన కొరటాల.. ఇప్పుడు ‘ఆచార్య’తోనూ బిగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ మూవీ పూర్తి కాకముందే […]
దిశ, వెబ్‌డెస్క్ : డైరెక్టర్ కొరటాల శివ తన సినిమాల ద్వారా సోషల్ మెసేజ్ ఇచ్చేందుకు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తుంటాడు. ‘మిర్చి, శ్రీమంతుడు, భరత్ అను నేను, జనతా గ్యారేజ్’ లాంటి సినిమాల ద్వారా ప్రకృతి పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, తోటి మనుషులను ప్రేమించడం, ఆపదొస్తే అండగా నిలవడం లాంటి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన కొరటాల.. ఇప్పుడు ‘ఆచార్య’తోనూ బిగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ మూవీ పూర్తి కాకముందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో మూవీ అనౌన్స్ చేసిన కొరటాల.. బన్నీతో కలిసి యువతలో కనువిప్పు కలిగే సందేశం ఇవ్వనున్నారని టాక్.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారెక్టర్‌లో సూపర్ వేరియేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించనున్న బన్నీ.. పొలిటికల్ లీడర్‌గా ఎలా చేంజ్ అయ్యాడనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఇంటర్వెల్ తర్వాత రియల్ పాలిటిక్స్‌ను తలపించేలా సినిమా సాగనుండగా.. యూత్ పాలిటిక్స్‌కు ఎందుకు రావడం లేదు? వస్తే ఎలా ఉంటుంది? సమాజంలో ఎలాంటి మార్పు వస్తుందనేది ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. బన్నీని రాజకీయ నాయకుడిగా చూపించే ఈ చిత్రం.. తనను నటుడిగా మరో మెట్టు ఎక్కిస్తుందని టాక్. కాగా పాలిటిక్స్ బేస్ చేసుకుని వచ్చిన రానా లీడర్, మహేష్ బాబు భరత్ అను నేను ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయగా.. బన్నీ ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.