కొండపల్లి మున్సిపాలిటీలో ట్విస్ట్.. ఆ అభ్యర్థి టీడీపీలో చేరిక..
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మెుత్తం 29 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీడీపీ-14, వైసీపీ-14 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ రెబల్ అభ్యర్థి అయిన శ్రీలక్ష్మి విజయం సాధించారు. దీంతో ఇరు పార్టీలు శ్రీలక్ష్మి మద్దతు కోసం ప్రయత్నించాయి. అయితే ఇంతలో ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది. మరోవైపు కొండపల్లి మున్సిపాలిటీలో ఎంపీ కేశినేని […]
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. మెుత్తం 29 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీడీపీ-14, వైసీపీ-14 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ రెబల్ అభ్యర్థి అయిన శ్రీలక్ష్మి విజయం సాధించారు. దీంతో ఇరు పార్టీలు శ్రీలక్ష్మి మద్దతు కోసం ప్రయత్నించాయి.
అయితే ఇంతలో ఆమె చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది. మరోవైపు కొండపల్లి మున్సిపాలిటీలో ఎంపీ కేశినేని నాని ఓటు హక్కు వినియోగించుకుంటే మెుత్తం టీడీపీ బలం 16కు చేరుకుంటుంది. వైసీపీ బలం 15కు పరిమితం అవుతుంది. ఒక్క ఓటు తేడాతో కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోనుంది.