రేవంత్ సవాల్‌పై స్పందించిన కొండా.. KTR రెస్పాన్స్ ఏంటి.?
దిశ, డైనమిక్ బ్యూరో: రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న డ్రగ్స్ కేసు ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంటోంది. సవాళ్లు ప్రతి సవాళ్లకు రాష్ట్ర రాజకీయాలు వేదికగా మారాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు మంత్రి కేటీఆర్ కి సంబంధం ఉందని, డ్రగ్స్ వాడేవారికి మంత్రి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ ఏ టెస్టు చేసుకునేందుకైనా సిద్ధమని ప్రకటించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. సోమవారం మధ్యాహ్నం 12 […]
దిశ, డైనమిక్ బ్యూరో: రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న డ్రగ్స్ కేసు ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంటోంది. సవాళ్లు ప్రతి సవాళ్లకు రాష్ట్ర రాజకీయాలు వేదికగా మారాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు మంత్రి కేటీఆర్ కి సంబంధం ఉందని, డ్రగ్స్ వాడేవారికి మంత్రి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ ఏ టెస్టు చేసుకునేందుకైనా సిద్ధమని ప్రకటించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరులు స్థూపం వద్దకు రావాలని, అక్కడ నుంచి డ్రగ్స్ టెస్టు చేసుకోవడానికి హాస్పిటల్ కి వెళ్దామంటూ కేటీఆర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
Thank you for accepting the #WhiteChallenge graciously Anna. Let’s meet at Amaraveerula sthupam on Monday 20th at 12 noon. https://t.co/YwJNyFUw1F
— Revanth Reddy (@revanth_anumula) September 18, 2021
ఇక ఈ విషయమై కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందిస్తూ ‘డ్రగ్స్ కేసులో నన్నెందుకు లాగారో అర్ధం అవడం లేదు. కానీ నేను ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్లు’ ట్విట్టర్ లో ప్రకటించారు. కొండాను రేవంత్ స్వాగతిస్తూ.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్థూపం వద్దకు రావాలని కోరారు. అయితే వైట్ ఛాలెంజ్ పై ఇప్పటి వరకు కేటీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రేవంత్ రెడ్డి మాత్రం దీనిని సీరియస్ గా తీసుకున్నారు. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ విషయంపై చేసిన మరో ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
I am against drugs not only as a social activist, but also as a PARENT.
Drugs have become prevalent in Telangana.
Many rich kids are taking drugs and they are ruining their lives.
Now drugs are spreading across the society ruining families & society.https://t.co/pJxYD9hbJJ— Konda Vishweshwar Reddy (@KVishReddy) September 19, 2021
ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే.. ‘I am against drugs not only as a social activist, but also as a PARENT. Drugs have become prevalent in Telangana. Many rich kids are taking drugs and they are ruining their lives. Now drugs are spreading across the society ruining families & society.’ అంటే ‘రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం విపరీతంగా మారింది, నేను మాదకద్రవ్యాలను సామాజిక కార్యకర్తగా మాత్రమే కాకుండా పేరెంట్‌గా కూడా వ్యతిరేకిస్తాను. చాలా మంది ధనవంతుల పిల్లలు డ్రగ్స్ తీసుకుని వారు వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇప్పుడు మాదకద్రవ్యాలు సమాజాన్ని వ్యాపింపజేస్తున్నాయి. అవి కుటుంబాలు మరియు సమాజాన్ని నాశనం చేస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా సమాజంలో డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయి ‘వైట్ ఛాలెంజ్’ పేరుతో ప్రతి ఒక్కరికి సవాల్ విసరాలని ట్విట్టర్ లో కొండా సూచించారు. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకు హీటెక్కుతోంది. మరి రేపు మధ్యాహ్నం అమర వీరుల స్థూపానికి ఎవరెవరు వస్తారో.. టెస్టులు చేయించుకొని ఏమని నిరూపించుకుంటారో చూడాల్సి ఉందని నెటిజన్లు చర్చ జరుపుతున్నారు.