ఇకనైనా సీఎం కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి: కోమటిరెడ్డి
దిశ, భువనగిరి : ఎల్ఆర్ఎస్‌పై హైకోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైకోర్టులో ఎల్ఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చిందన్నారు. పిటిషనర్ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరమే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు నుంచి తుది ఆదేశాలు వచ్చేంత వరకు ఎల్ఆర్ఎస్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని […]
దిశ, భువనగిరి : ఎల్ఆర్ఎస్‌పై హైకోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైకోర్టులో ఎల్ఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చిందన్నారు. పిటిషనర్ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరమే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు నుంచి తుది ఆదేశాలు వచ్చేంత వరకు ఎల్ఆర్ఎస్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఇకనైనా ఎల్ఆర్ఎస్‌ను రద్దుచేయాలని, ప్రజలను ఇబ్బందులు పెట్టినందుకు కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక పథకాలు తీసుకొస్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.