ఈ తాజా వార్త కొల్లు రవీంద్ర గురించే

దిశ, ఏపీ బ్యూరో: మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర రిమాండ్ న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని, రాజకీయ కక్షతో తనను ఈ కేసులో ఇరికించారని కొల్లు రవీంద్ర బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం తరపు న్యాయవాది.. ఈ కేసులో నిందితులు సమాజంలో పలుకుబడి ఉన్నవారని, కేసులో సాక్ష్యాలను తారుమారు చేయగల సమర్థులని వివరిస్తూ, మరింత […]

Update: 2020-07-19 01:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర రిమాండ్ న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని, రాజకీయ కక్షతో తనను ఈ కేసులో ఇరికించారని కొల్లు రవీంద్ర బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం తరపు న్యాయవాది.. ఈ కేసులో నిందితులు సమాజంలో పలుకుబడి ఉన్నవారని, కేసులో సాక్ష్యాలను తారుమారు చేయగల సమర్థులని వివరిస్తూ, మరింత లోతైన విచారణకు అప్పగించాలని కోరడంతో రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News