కోల్‌కతాను గెలిపించిన ఆ ఇద్దరు

దిశ, వెబ్‌డెస్క్: స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆటగాళ్లు తొలుత తడబడ్డా.. చివరకు విజయం సాధించారు. ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయినా.. మరో ఇద్దరు ఆటగాళ్లు జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్ మన్‌ గిల్ (70) కోల్‌కతా విజయంలో కీలక పాత్ర వహించాడు. 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది అద్భుత బ్యాటింగ్ ప్రతిభను కనబరుస్తూ.. స్కోరు బోర్డును అమాంతం విజయం వైపు తీసుకెళ్లాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రానా 13 […]

Update: 2020-09-26 12:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆటగాళ్లు తొలుత తడబడ్డా.. చివరకు విజయం సాధించారు. ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయినా.. మరో ఇద్దరు ఆటగాళ్లు జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్ మన్‌ గిల్ (70) కోల్‌కతా విజయంలో కీలక పాత్ర వహించాడు. 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది అద్భుత బ్యాటింగ్ ప్రతిభను కనబరుస్తూ.. స్కోరు బోర్డును అమాంతం విజయం వైపు తీసుకెళ్లాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రానా 13 బంతుల్లో 26 పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడినా.. క్యాచ్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో వచ్చిన ఇయాన్ మోర్గాన్ (42) కూడా మంచి భాగస్వామ్యం కనబరిచి జట్టు విజయానికి దోహదపడ్డాడు. 29 బంతుల్లో ఇయాన్ మోర్గాన్ 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో 7 వికెట్లు మిగిలుండగానే కోల్‌కతా నైట్ రైడర్స్ హైదరాబాద్ జట్టు పై అనూహ్య విజయం సాధించింది.

రైజర్స్ ఇన్నింగ్స్:

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేసింది. ఓపెనర్లు సైతం బాల్ టు బాల్ రన్ కోసమే ప్రయత్నించారే తప్ప బౌండరీల పై దృష్టి సారించలేకపోయారు. ఓపెనర్ బెయిర్ స్టో 10 బంతులను ఫేస్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే చేసి 24 స్కోర్ బోర్డు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్(36) 30 బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ బాది 59 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు.

ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే (51) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాది స్కోరు బోర్డును కాస్త ముందుకు లాగాడు. ఆ తర్వాత ఆండ్రూ రస్సెల్ వేసిన ఓవర్‌లో 121 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన వృద్ధిమాన్ సాహా 31 బంతుల్లో 30 పరుగులు చేశాడు. 138 పరుగుల వద్ద రన్ ఔట్ అయ్యాడు. దీంతో కీలక వికెట్లను కోల్పోయిన హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా కోల్‌కతా బౌలర్లు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ల పై ఒత్తిడి తెచ్చి స్కోర్ బోర్డును కట్టడి చేశారనే చెప్పాలి.

స్కోర్ బోర్డు:

Sunrisers Hyderabad: డేవిడ్ వార్నర్ (C) (c and b) చక్రవర్తి 36(30), బెయిర్‌ స్టో (wk) (b) కమ్మిన్స్ 5 (10), మనీష్ పాండే (c and b) రస్సెల్ 51 (38), వృద్ధిమాన్ సాహా రనౌట్ (కమ్మిన్స్ / కార్తీక్) 30 (31), నబీ నాటౌట్ 11 (8), అభిషేక్ శర్మ నాటౌట్ 2 (3), ఎక్స్‌ట్రాలు (7), మొత్తం స్కోరు: 142/ (4 wkts, 20 Ov)

వికెట్ల పతనం: 24/1 (జాని బెయిర్‌స్టో 3.6), 59/2 (డేవిడ్ వార్నర్, 9.1), 121/3 (మనీష్ పాండే, 17.4), 138/4 ( వృద్ధిమాన్ సాహా, 19.2).

బౌలింగ్: నరైన్ 4-0-31-0, కమ్మిన్స్ 4-0-19-1, శివం మావి 2-0-15-1 కుల్దీప్ యాదవ్ 2-0-15-0, చక్రవర్తి 4-0-25-1, కె నాగర్కోటి 2-0-17-1, రస్సెల్ -2-0-16-1.

Kolkata Knight Riders: శుబ్‌మన్ గిల్ నాటౌట్ గ్ 70(62)సునీల్ నరైన్ (c) వార్నర్ (b) ఖలీల్ అహ్మద్ 0 (2), నితీష్ రానా (c) వృద్ధిమాన్ సాహా (b) నటరాజన్ 26 (13), దినేష్ కార్తీక్ lbw (b) రషీద్ ఖాన్ 0 (3), ఇయాన్ మోర్గాన్ నాటౌట్ 42(29). ఎక్స్‌ట్రాలు.. 7 మొత్తం స్కోరు: 145/3 (3 wkts, 18 Ov)

వికెట్ల పతనం: 6/1 (సునీల్ నరైన్, 1.2), 43/2 (నితీష్ రానా, 4.4), 53/3 (దినేష్ కార్తీక్, 6.2),

బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 3-0-29-0, ఖలీల్ అహ్మద్ 3-0-28-1, నటరాజన్ 3-0-27-1 రషీద్ ఖాన్ 4-0-25-1 మహ్మద్ నబీ 4-0-23-0 అభిషేక్ శర్మ 1-0 -11-0.

పాయింట్ల పట్టిక

Tags:    

Similar News