'టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నడ్డీవిరుస్తుంది'
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వమంటునే.. అర్హతగల రైతుల నడ్డీవిరుస్తుందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియలో రూ.లక్ష లోపు అర్హత ఉన్న కొంతమంది పేద రైతులకు ఇంకా నూతన పాసు పుస్తకాలు అందలేదన్నారు. కొత్త పాసు పుస్తకాలు లేని రైతులకు కూడా రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూమి ఉండి పాసు పుస్తకాలు లేని రైతులందరికి రుణమాఫీ అందించాలన్నారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేసినప్పటికీ […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వమంటునే.. అర్హతగల రైతుల నడ్డీవిరుస్తుందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియలో రూ.లక్ష లోపు అర్హత ఉన్న కొంతమంది పేద రైతులకు ఇంకా నూతన పాసు పుస్తకాలు అందలేదన్నారు. కొత్త పాసు పుస్తకాలు లేని రైతులకు కూడా రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూమి ఉండి పాసు పుస్తకాలు లేని రైతులందరికి రుణమాఫీ అందించాలన్నారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేసినప్పటికీ బ్యాంకులు వడ్డీ వసూలకే సరిపడిందన్నారు. రుణమాఫీ చేసిన ప్రయోజనం జరగలేదన్నారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని రుణమాఫీ నిధులు మొత్తం ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి మధ్యప్రదేశ్ ప్రభుత్వం వలే ఏకకాలంలో మాఫీ చేయాలని కోదండరెడ్డి సూచించారు.