బంగారం స్వచ్ఛతను తెలుసుకోండిలా..?
దిశ, వెబ్‌డెస్క్ : బంగారమంటే భారతీయులకు చెప్పలేనంత ప్రీతి. మహిళలు ఆభరణాన్ని తమ శరీరంలో భాగంగా భావిస్తారు. పురుషుల్లోనూ పుత్తడిని ఇష్టపడని వారు ఉండారు. భారతీయులు అంతగా ఇష్టపడతారు కాబట్టే గోల్డ్ రేట్ ఎంత ఉన్నా.. తమ స్థాయికి తగ్గట్టు కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి విలువైన, ఇష్టమైన బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తం లేకపోయినా, జాగ్రత్తలు తీసుకోకపోయినా మోసపోవడం గ్యారెంటీ. గోల్డ్‌పై అవగాహన లేకుండా తీసుకోవడం సరైన విధానం కాదు. జ్యువెలరీ షాపుల్లో ఎలాంటి […]
దిశ, వెబ్‌డెస్క్ : బంగారమంటే భారతీయులకు చెప్పలేనంత ప్రీతి. మహిళలు ఆభరణాన్ని తమ శరీరంలో భాగంగా భావిస్తారు. పురుషుల్లోనూ పుత్తడిని ఇష్టపడని వారు ఉండారు. భారతీయులు అంతగా ఇష్టపడతారు కాబట్టే గోల్డ్ రేట్ ఎంత ఉన్నా.. తమ స్థాయికి తగ్గట్టు కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి విలువైన, ఇష్టమైన బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తం లేకపోయినా, జాగ్రత్తలు తీసుకోకపోయినా మోసపోవడం గ్యారెంటీ. గోల్డ్‌పై అవగాహన లేకుండా తీసుకోవడం సరైన విధానం కాదు. జ్యువెలరీ షాపుల్లో ఎలాంటి బంగారాన్ని అమ్ముతారు..? క్యారెట్ అంటే ఏంటీ..? బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి..? ఇలాంటి విషయాలపై అవగాహన అవసరం. ఈ వివరాలన్ని తెలుసుకోవాలంటే ‘దిశ’అందిస్తున్న ఈ కథనం చదవాల్సిందే.
స్వర్ణం ఎంతో సున్నితమైంది. దీనిని క్యారెట్లలో లెక్కిస్తారు. బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 క్యారెట్ల వరకు లెక్కిస్తారు. క్యారెట్ స్థాయి పెరిగే కొద్ది ధర పెరుగుతుంది. స్వచ్ఛమైన బంగారంతో ఆభరణాలు చేయడం కుదరదు. దానికి రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలిస్తేనే ఆభరణాలు చేయడం సాధ్యపడుతుంది. బంగారం, ఇతర లోహాల మిశ్రమాలు ఏ మోతాదులో కలిశాయనేది కూడా క్యారెట్ తెలుపుతుంది.
బంగారంలో రకాలు ఇలా..
24 క్యారెట్ల బంగారం. ఇది 99.9 శాతం స్వచ్ఛమైంది. దీనిని మించిన బంగారం ఉండదు. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ఖరీదైంది. కేవలం పెట్టుబడులకు 24 క్యారెట్ల బంగారం అనువైనది. ఆభరణాల తయారీకి దీనిని వినియోగించలేం.
22 క్యారెట్ల బంగారం. 24 క్యారెట్ల బంగారం కంటే ఇది హార్డ్‌గా ఉంటుంది. ఆభరణాల తయారీకి ఇది అనువైంది. 22 వంతుల బంగారం ఉంటే.. రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి మెటల్స్ ఉంటాయి. ఇది 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం.
18 క్యారెట్ల బంగారం. ఇది 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత హార్డ్‌గా, మన్నికగా ఉంటుంది. 18 క్యారెట్ల బంగారంలో 75 శాతం పసిడి, 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. ఇందులో 18 భాగాల పసిడి.. ఆరు భాగాల ఇతర మెటల్స్ ఉంటాయి.
14 క్యారెట్ల బంగారంలో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. ఇది మన్నికతోపాటు ధర కూడా తక్కువ. మార్కెట్లో 10 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారం కూడా లభ్యం అవుతుంది.
బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి..?
బంగారం స్వచ్ఛతను ఫైన్‌నెస్, దాని రంగును బట్టి గుర్తించొచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండటంతోపాటు డార్కిష్‌గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసేకొద్దీ బంగారం రంగు మారుతుంది. వైట్ గోల్డ్‌లో నికెల్ ఎక్కువగా ఉంటుంది. హాల్‌మార్క్ బంగారు నగలు అనే పేరును మీరు వినే ఉంటారు. బంగారు ఆభరణాల షాపులు ఈ పేరుతో ప్రకటనలు కూడా ఇస్తుంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS సంస్థకు చెందిన గుర్తే హాల్‌మార్క్. ఈ గుర్తు ఉన్న నగలు నాణ్యమైనవి. వాస్తవానికి ప్రతీ నగల షాపు హాల్‌మార్క్ గుర్తు ఉన్న బంగారు నగలనే అమ్మాలి.
ఈ జాగ్రత్తలు తప్పని సరి
బంగారాన్ని ఏ షాపులో కొనుగోలు చేసినా ఆ షాపు నుంచి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పినా.. బిల్లు తీసుకోవడం మరవద్దు. బంగారం తూకంలో అనుమానం ఉంటే మరో చోట తూకం వేయించుకొచ్చు. తేడా అనిపిస్తే ఆ జ్యువెలరీపై కన్స్యూమర్స్ ఫోరమ్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే నగలు కొనేప్పుడు రాళ్లను కలిపి తూకం వేయించవద్దు. అలా తూకం వేస్తే మీరు మోసపోతున్నట్లే. రాళ్ల బరువు తీసేసి తూకం వేయాలి. రాళ్లకు వేరుగా బిల్లు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీర స్వచ్ఛమైన బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. మీరు మొదటిసారి బంగారాన్ని కొనుగలు చేస్తే.. పుత్తడిపై అవగాహన ఉన్నవారిని వెంట తీసుకెళ్లడం ఉత్తమం.