IPL 2022 : ముంబై జట్టులో మరో స్టార్ ఓపెనర్.. అదే జరిగితే ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు..!

దిశ, వెబ్‌డెస్క్ : IPL -2022 సీజన్ కోసం BCCI ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. రెండు కొత్త జట్లను ఖరారు చేయగా.. ఇక ఆటగాళ్ల రిటెన్షన్ విధానంపై పలు సూచనలను పరిగణలోకి తీసుకొని నిబంధనలను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న 8 జట్లకు తోడుగా కొత్తగా రెండు జట్లు చేరాయి. ఆటగాళ్ల రిటెన్షన్ విధానంతో దాదాపు అన్ని జట్లల్లోనూ కొత్త ముఖాలు కనిపించడానికి అవకాశం ఏర్పడినట్టయింది. కొత్త రిటెన్షన్ పాలసీ ప్రకారం మెగా ఆక్షన్‌ను నిర్వహించడానికి ముందే […]

Update: 2021-10-30 11:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : IPL -2022 సీజన్ కోసం BCCI ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. రెండు కొత్త జట్లను ఖరారు చేయగా.. ఇక ఆటగాళ్ల రిటెన్షన్ విధానంపై పలు సూచనలను పరిగణలోకి తీసుకొని నిబంధనలను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న 8 జట్లకు తోడుగా కొత్తగా రెండు జట్లు చేరాయి. ఆటగాళ్ల రిటెన్షన్ విధానంతో దాదాపు అన్ని జట్లల్లోనూ కొత్త ముఖాలు కనిపించడానికి అవకాశం ఏర్పడినట్టయింది. కొత్త రిటెన్షన్ పాలసీ ప్రకారం మెగా ఆక్షన్‌ను నిర్వహించడానికి ముందే పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వీలు లభించింది. ఈ నలుగురిలో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక ఓవర్సీస్ ప్లేయర్/ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు లేదా ఇద్దరు ఓవర్సీస్ క్రికెటర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో చాలామంది భారత ఆటగాళ్ళతో పాటు విదేశీ ప్లేయర్స్ సైతం మెగా ఆక్షన్‌లోకి రానున్నారు. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్.. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్.. ఇలా ఇంటర్నేషనల్ స్టార్ ప్లేయర్స్ ఎందరో ఉన్నారు.

ఈ మెగా వేలం నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాహుల్‌ ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది. రాహుల్ వచ్చే ఏడాది పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించడం లేదని ప్రముఖ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ క్రిక్ బజ్ తమ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది.

అయితే, బ్యాటర్‌గా అద్బుతంగా రాణిస్తున్నప్పటికీ.. కెప్టెన్‌గా ఆ జట్టుకు టైటిల్‌ అందించకపోవడంపై రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు కేఎల్ రాహుల్.. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఫాలోవ్వడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఈ క్రమంలో ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్ వినపడుతుంది.ఇక ఈ వార్త గానీ నిజమైతే అభిమానులకు పండుగే పండగ. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ లాంటి భారత స్టార్ ఓపెనర్లు ముంబైకి ఆడితే.. ఆ జట్టును ఆపడం కష్టమే.

Tags:    

Similar News