ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్.. నేటి మ్యాచ్ వాయిదా
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14పై కరోనా ఎఫెక్ట్ పడింది. ఇద్దరు కోల్‌కతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో నేడు జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ 30వ మ్యాచ్‌ను వాయిదా వేశారు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇదే రోజు కరోనా నివారణ, ఆక్సిజన్‌ల కోసం తమ వంతు సాయంగా విరాళాలు సేకరిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు బ్లూ జెర్సీతో బరిలోకి దిగేందుకు సమాయత్తం కాగా, చివరి […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14పై కరోనా ఎఫెక్ట్ పడింది. ఇద్దరు కోల్‌కతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో నేడు జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ 30వ మ్యాచ్‌ను వాయిదా వేశారు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇదే రోజు కరోనా నివారణ, ఆక్సిజన్‌ల కోసం తమ వంతు సాయంగా విరాళాలు సేకరిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు బ్లూ జెర్సీతో బరిలోకి దిగేందుకు సమాయత్తం కాగా, చివరి నిమిషంలో వైరస్ మ్యాచ్‌కే అడ్డుకట్ట వేసింది. అయితే, రద్దుచేస్తున్న మ్యాచ్‌ను ఎప్పుడూ నిర్వహిస్తారో బీసీసీఐ స్పష్టం చేయనుంది. ప్రస్తుతం కోల్‌కతా ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నట్టు సమాచారం.