గదకు పేరు పెట్టిన న్యూజీలాండ్.. ఫ్లైట్‌లో స్పెషల్ సీటు
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవడం ద్వారా సరి కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నది. తమ దేశ క్రికెట్ చరిత్రలో తొలి సారి వరల్డ్ టైటిల్ గెలవడంతో ఆటగాళ్లు ఒక రాత్రంతా సంబరాల్లో మునిగిపోయారు. తెల్లారిన తర్వాత కేన్ విలియమ్‌సన్ ఐసీసీ అందించిన గదతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు గదను ఆప్యాయంగా తీసుకొని ఫొటోలు తీసుకున్నారు. అంతే కాదు ఆ గదకు ఒక పేరు పెట్టారట కివీస్ […]
దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవడం ద్వారా సరి కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నది. తమ దేశ క్రికెట్ చరిత్రలో తొలి సారి వరల్డ్ టైటిల్ గెలవడంతో ఆటగాళ్లు ఒక రాత్రంతా సంబరాల్లో మునిగిపోయారు. తెల్లారిన తర్వాత కేన్ విలియమ్‌సన్ ఐసీసీ అందించిన గదతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు గదను ఆప్యాయంగా తీసుకొని ఫొటోలు తీసుకున్నారు. అంతే కాదు ఆ గదకు ఒక పేరు పెట్టారట కివీస్ ప్లేయర్లు. టెస్టు గదకు ‘మైఖేల్ మేసన్’ అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరు పెట్టడానికి కారణం కూడా కేన్ విలియమ్‌సన్ చెప్పాడు. ‘న్యూజీలాండ్ జట్టు తరపున మైఖేల్ మేసన్ అనే క్రికెటర్ 2004లో ఒకే ఒక టెస్టు ఆడాడు. అంతే కాకుండా 26 వన్డేలు, 3 టీ20లు కూడా ఆడి దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. న్యూజీలాండ్‌లో అసలు క్రికెట్ ఆటే తెలియని ప్రాంతం నుంచి వచ్చిన మేసన్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందుకే అతడికి గుర్తుగా గదకు ఆయన పేరు పెట్టాము’ అని కేన్ విలియమ్‌సన్ చెప్పాడు. రెండేళ్ల కష్టానికి తగిన ఫలితం లభించిందని ఆటగాళ్లు ఉత్సహంగా చెప్పారు. ఇక ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి పయనమైన కివీస్ టీమ్.. ఆ గదకు ఫ్లయిట్‌లో ఒక ప్రత్యేకమైన సీటు కూడా కేటాయించింది. సీటులో పెట్టి బెల్టు వేసి ఉన్న ఫొటోలను న్యూజీలాండ్ క్రికెట్ షేర్ చేసింది.