భువన గిరి కోటపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ,భువనగిరి రూరల్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర‌లో భాగంగా నాల్గవ రోజు భువనగిరి‌కి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణంలోని సాయిబాబా దేవాలయం నుంచి ప్రధాన రహదారి గుండా వినాయక్ చౌరస్తా వరకు పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక వినాయక్ చౌరస్తా‌లో ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కెసీఆర్ హుజురాబాద్‌లో ఓటర్లకు ఫోన్లు చేస్తున్నాడని, వందల […]

Update: 2021-08-21 03:28 GMT

దిశ,భువనగిరి రూరల్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర‌లో భాగంగా నాల్గవ రోజు భువనగిరి‌కి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణంలోని సాయిబాబా దేవాలయం నుంచి ప్రధాన రహదారి గుండా వినాయక్ చౌరస్తా వరకు పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక వినాయక్ చౌరస్తా‌లో ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కెసీఆర్ హుజురాబాద్‌లో ఓటర్లకు ఫోన్లు చేస్తున్నాడని, వందల కోట్లు పంపిస్తున్నారని అన్నారు.

కుటుంబ రాజకీయాలు చేసేవారిని తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారని రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదు బీజేపీ నాయకులను జైల్లో పెట్టినా, హుజురాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని, ప్రజలు బీజేపీని గెలిపిస్తారని, రాష్ట్రం‌లో వచ్చే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం పోయి బీజేపీ వస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యే‌లు గెలిస్తే, వారు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. తెలంగాణ‌లో మౌలిక సౌకర్యాల అభివృద్ధి‌కి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఉచితంగా అందరికి కరోనా వ్యాక్సినేషన్ అందించామని డిసెంబర్‌లోపు కరోనా వ్యాక్సినేషన్ చాలా వరకు పూర్తి అవుతుంది, ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామపంచాయితీలకు, మున్సిపాలిటీ‌లకు నిధులు, వ్యవసాయానికి సంబంధించి ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీ మోదీ ప్రభుత్వం అందిస్తుంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ‌లలో ఓబీసీ‌లకు రిజర్వేషన్లు అందించారు.

జమ్మూకాశ్మీర్ లో 370కి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాం దాన్ని రద్దు చేసుకొని, భారత రాజ్యాంగం పరిధిలోకి తీసుకురావటం కీలక ఘట్టం నా జీవితం‌లో ఇది కీలక నిర్ణయం. క్యాబినెట్ మంత్రి గా నాకు మోడీ అవకాశం కల్పించారు. నేను ఈ ఛాలెంజ్‌ని స్వీకరించాను, ఈశాన్య రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందు‌కు కృషి చేస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా ప్రోత్సాహిస్తున్నాము. కొవిడ్ కారణంగా దేశానికి పర్యాటకులు విదేశాల నుంచి రాలేదు జీడీపీ 5 శాతం మాత్రమే పర్యాటకం నుంచి ఉంటుంది మన దేశంలో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, పర్యాటక రంగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.

జనవరి నుంచి మళ్ళీ పర్యాటకం ప్రారంభిస్తాము. మన రాష్ట్రం‌లో ప్రజల పండగలు, బతుకమ్మ, గిరిజన పండగలు సమ్మక్క సారక్క జాతరలు జరుగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో వాటిని గుర్తించనున్నాం వాటన్నింటినీ చిత్రీకరించి టూరిజం స్పాట్‌లుగా చేయనున్నాం. నరేంద్ర మోదీ మంత్రి వర్గం‌లో బీసీ వర్గానికి చెందిన 27 మంత్రులు కేంద్రాల్లో క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. 11 మంది మహిళ మంత్రులు, 5 మైనారిటీ మంత్రులు ఉన్నారు. 84 మంది మంత్రుల్లో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని అన్నారు. 7 ఏళ్లలో కేసీఆర్ పేదలకు ఇళ్ళు కట్టివ్వలేదు ఎన్ని ఇళ్ళు కట్టినా కేంద్రం అందుకు కేంద్రం వాటా ఇవ్వటానికి సిద్ధం‌గా ఉన్నాం, పొదుపు సంఘాలకు 20 లక్షల లోన్లు ఇస్తుంది, కరోనా కాలం లో ఆక్సిజన్, మాస్కులు ప్రజలకు అందించారు. తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ, జాతీయ రహదారుల అభివృద్ధికి కట్టుబడి ఉంది. భువనగిరి లో కోట ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే రోప్ వే ద్వారా అభివృద్ధి చేస్తాం ఒక పర్యాటక కేంద్రం గా చేస్తామన్నారు.

Tags:    

Similar News