మా మొదటి సంతకం ‘విమోచనం’పైనే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించిన సెప్టెంబరు 17వ తేదీని స్వపరిపాలనలోనూ విమోచనా దినోత్సవంగా జరుపుకోలేని దుస్థితిలో ఉన్నామని, బీజేపీ పవర్‌లోకి రాగానే అధికారికంగా నిర్వహించుకునే ఉత్తర్వులపై తొలి సంతకం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విమోచనా దినోత్సవంగా జరుపుకుంటున్న బీజేపీ శ్రేణులు ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. రెండో సంతకాన్ని తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే నిర్ణయంపై […]

Update: 2021-09-17 10:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభించిన సెప్టెంబరు 17వ తేదీని స్వపరిపాలనలోనూ విమోచనా దినోత్సవంగా జరుపుకోలేని దుస్థితిలో ఉన్నామని, బీజేపీ పవర్‌లోకి రాగానే అధికారికంగా నిర్వహించుకునే ఉత్తర్వులపై తొలి సంతకం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విమోచనా దినోత్సవంగా జరుపుకుంటున్న బీజేపీ శ్రేణులు ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించారు. రెండో సంతకాన్ని తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చే నిర్ణయంపై పెడతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇంతకన్నా మించిన పండుగ మరొకటి ఉండదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తన తప్పును తెలుసుకుని అమరుల ఆత్మకు శాంతి చేకూరేలా ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని హితవు పలికారు.

ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీలు సెప్టెంబరు 17 చారిత్రాత్మక రోజును విమోచనగా అధికారికంగా నిర్వహించకుండా అన్యాయం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీగానీ, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ గానీ ఓటు బ్యాంకు కోసం మజ్లిస్ పార్టీ కనుసన్నల్లో పనిచేశాయని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అదే అమలవుతుందని, ఆ పార్టీ చేతిలో టీఆర్ఎస్ కీలుబొమ్మగా మారిందని, మోచేతి నీళ్ళు తాగుతూ ఉన్నదన్నారు. అటు ఒవైసీగానీ, ఇటు కేసీఆర్‌గానీ తెలంగాణ ప్రజలను ఎప్పటికీ బానిసల స్థాయిలోనే ఉంచాలని కోరుకుంటున్నాయన్నారు. రజాకార్ల నేత కాశిం రజ్వీ పెట్టిన పార్టీ మజ్లిస్ అని గుర్తుచేశారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు చరిత్రను తొక్కిపెడుతున్నాయన్నారు.

Tags:    

Similar News