రమేష్‌కుమార్ లేఖ అందింది: కిషన్ రెడ్డి
తనకు భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ అందిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ లేఖపై ఏపీ సీఎస్‌తోపాటు కేంద్ర హోం శాఖ కార్యదర్శితో మాట్లాడినట్టు తెలిపారు. ఆ లేఖను ఆయన రాసినట్టుగానే భావిస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. సీఈసీ రక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమే అయినప్పటికీ ఏ ప్రభుత్వోద్యోగి అయినా విధినిర్వహణలో ఉన్నప్పుడు భయపెట్టడం మంచిది కాదని, కేంద్ర […]
తనకు భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ అందిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ లేఖపై ఏపీ సీఎస్‌తోపాటు కేంద్ర హోం శాఖ కార్యదర్శితో మాట్లాడినట్టు తెలిపారు. ఆ లేఖను ఆయన రాసినట్టుగానే భావిస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. సీఈసీ రక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమే అయినప్పటికీ ఏ ప్రభుత్వోద్యోగి అయినా విధినిర్వహణలో ఉన్నప్పుడు భయపెట్టడం మంచిది కాదని, కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఏపీ సీఎస్, కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నానని ఆయన తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకే సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. రమేష్ కుమార్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినా పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఏపీ సీఎస్‌కు సూచించామన్నారు. అవసరమైతే లిఖితపూర్వ ఆదేశాలు జారీ చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
Tags : kishan reddy, central deputy home minister, hyderabad, bjp, sec, ramesh kumar