టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలు అర్థరహితం : కిసాన్ మోర్చా బీజేపీ
దిశ, ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం, ధర్నాకు దిగడం విడ్డూరంగా ఉందని కిసాన్ మోర్చా బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, కిసాన్ మోర్చా పాండిచ్చేరి ఇన్చార్జ్ బస్వ పాపయ్యు గౌడ్ అన్నారు. బిజేపి కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్క రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న బసవ పాపయ్య గౌడ్ మాట్లాడుతూ.. వరి ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వార కొనుగోలు చేసి […]
దిశ, ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం, ధర్నాకు దిగడం విడ్డూరంగా ఉందని కిసాన్ మోర్చా బిజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, కిసాన్ మోర్చా పాండిచ్చేరి ఇన్చార్జ్ బస్వ పాపయ్యు గౌడ్ అన్నారు. బిజేపి కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్క రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న బసవ పాపయ్య గౌడ్ మాట్లాడుతూ.. వరి ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వార కొనుగోలు చేసి ఎఫ్ సీఐ ద్వార కేంద్రానికి ధాన్యంను అమ్మాల్సివుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కేంద్రానికి మధ్యవర్తిత్వం వహించాల్సి ఉంటుంది. కెసీఆర్ ప్రభుత్వం తెచ్చిన కొత్త పద్ధతి, రైతులు ముందుగా కొనుగోలు కేంద్రాల వద్ద, ఇంటర్నెట్ కేంద్రాల వద్ద, పోస్ట్ ఆఫీస్లో, మొబైల్ ఫోన్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రైతులు ఇంటర్నెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొంటే, పండించిన పంట ఎప్పుడు కొయ్యాలి అనేది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, అప్పటివరకు అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిపోతుందని, రైతులకు చేతికొచ్చిన పంట ఆగమవుతుందని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అందరి దృష్టి మళ్లించడం కోసమే, కేసీఆర్ ధర్నాకు పిలుపునిచ్చాడని ఆరోపించారు.
రైతుల పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా, రైతులకోసం పోరాడుతున్నట్లు రోడెక్కడం అధికారంలో ఉన్న పార్టీల చేతగాని తనానికి నిదర్శనం అన్నారు. కేవలం పార్టీ నాయకులే తప్పా, నాగలి పట్టి దుక్కి దున్నిన ఒక్క రైతు కూడా ఎక్కడ కనిపించలేదని, మీ కపటనాటకాలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని అన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రం వద్ద ఒప్పుకుని, లేఖ ఇచ్చిన విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైస్ మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మకై, మిల్లర్లకు లాభాలు చేకూరే విధంగా, వానకాలం వడ్లను కొంటాం, యాసంగి వడ్లను కేంద్రమే కొనాలని, రైతులను మోసం చేసే విధంగా కెసీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. రైతుబంధు అమలు చేస్తున్నామని ఇతర సబ్సిడీలను ఎత్తివేశారని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుబంధుతో భూస్వాములు బాగు పడుతున్నారని సన్న, చిన్న కారు రైతులు ఇబ్బందులలోనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధనకార్యదర్శి మర్పల్లి అంజయ్య యాదవ్, కిసాన్ మోర్చా జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు నల్లవోలు బోజిరెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సర్విగారి నరసింహారెడ్డి, కంబాలపల్లి విట్టల్ రెడ్డి, తాళ్ళ వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ దన్నే శ్రీశైలం పాల్గొన్నారు.