రక్తదాతలను సన్మానించిన కిమ్స్

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కరోనా సమయంలో రక్తదనం చేసిన పలువురు దాతలను కృష్ణ ఇన్‌స్టిటిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆస్పత్రి యాజమాన్యం శనివారం సన్మానించింది. కిమ్స్ హాస్పిటల్స్ సీఓఓ భరత్‌కాంత్‌రెడ్డి రక్తదాతలకు మెమెంటోలను పంపిణీ చేశారు. లాక్‌డౌన్ సమయంలో రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారి కృషికి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ‌కుమార్ మాట్లాడుతూ.. ఈ మహమ్మారి సమయంలో సురక్షితమైన రక్తదానం గురించి పాల్గొన్నందుకు, అవగాహన కల్పించినందుకు […]

Update: 2020-06-13 06:17 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కరోనా సమయంలో రక్తదనం చేసిన పలువురు దాతలను కృష్ణ ఇన్‌స్టిటిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆస్పత్రి యాజమాన్యం శనివారం సన్మానించింది. కిమ్స్ హాస్పిటల్స్ సీఓఓ భరత్‌కాంత్‌రెడ్డి రక్తదాతలకు మెమెంటోలను పంపిణీ చేశారు. లాక్‌డౌన్ సమయంలో రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారి కృషికి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ‌కుమార్ మాట్లాడుతూ.. ఈ మహమ్మారి సమయంలో సురక్షితమైన రక్తదానం గురించి పాల్గొన్నందుకు, అవగాహన కల్పించినందుకు మీడియాకు, ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. దానం చేసిన రక్తం బలహీన వ్యక్తుల వైద్య అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని, కరోనా ప్రారంభం కారణంగా దాతల సంఖ్య గణనీయంగా తగ్గినందున ఆసుపత్రులకు గతంలో కంటే ఎక్కువ రక్త సరఫరా అవసరమని అన్నారు. కిమ్స్ ఆస్పత్రి ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ హితేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి ప్రారంభ కాలంలో తప్పుడు సమాచారం కారణంగా దాతలు భయపడ్డారని, రక్తదానం చేయడానికి ఇష్టపడలేదన్నారు. ఆ కాలంలో ముందుకు వచ్చిన రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ -19 మహమ్మారి ప్రమాదం ఇంకా కొనసాగుతున్నప్పుడు కూడా ప్రజలు స్వచ్ఛంద రక్తదానం చేయవలసిన అవసరాన్ని అర్థం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు.

Tags:    

Similar News