రూ.2 కోట్లకు కిడ్నీలు అమ్మబడును.. దంపతుల పోస్టు వైరల్..!
దిశ, వెబ్‌డెస్క్ : కిడ్నీలు అమ్ముతామంటూ దంపతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. తమకున్న అప్పులు తీర్చేందుకు రూ.2 కోట్లకు కిడ్నీలు అమ్మతామంటూ పెట్టిన పోస్టు మోసగాళ్ల కంటపడింది. తాము కిడ్నీలు కొనుగోలు చేస్తామంటూ ఓ ఆస్పత్రి పేరిట కాంటాక్ట్ అయ్యారు చీటర్స్. టోకెన్ అమౌంట్ కింద రూ. రెండున్నర కోట్లు పంపుతామని దంపతులను నట్టేటా ముంచారు. మీ అకౌంట్లోకి డబ్బులు పంపించామని ఫొన్ చేసిన కేటుగాళ్లు డబ్బులు విత్ డ్రా కోసం పాస్‌వర్డ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : కిడ్నీలు అమ్ముతామంటూ దంపతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. తమకున్న అప్పులు తీర్చేందుకు రూ.2 కోట్లకు కిడ్నీలు అమ్మతామంటూ పెట్టిన పోస్టు మోసగాళ్ల కంటపడింది. తాము కిడ్నీలు కొనుగోలు చేస్తామంటూ ఓ ఆస్పత్రి పేరిట కాంటాక్ట్ అయ్యారు చీటర్స్. టోకెన్ అమౌంట్ కింద రూ. రెండున్నర కోట్లు పంపుతామని దంపతులను నట్టేటా ముంచారు. మీ అకౌంట్లోకి డబ్బులు పంపించామని ఫొన్ చేసిన కేటుగాళ్లు డబ్బులు విత్ డ్రా కోసం పాస్‌వర్డ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ దంపతులు రూ.10 లక్షలు డిపాజిట్ చేసి ఆస్పత్రి వర్గాలతో సంప్రదింపులు జరిపారు.
బెంగళూరులోని తమ ప్రతినిధులు రూ. రెండున్నర కోట్లు ఇస్తారని మోసగాళ్లు దంపతులను నమ్మించారు. తీరా అక్కడికి వెళ్లాక నల్ల కాగితాలు చేతిలో పెట్టి ఇవే డబ్బులని వారిని నమ్మించారు. నల్ల కాగితాలపై కెమికల్ పోసి రెండ్రోజుల తర్వాత చూడాలంటూ దంపతులకు చెప్పారు. చీటర్స్ చెప్పినట్లే చేయగా రెండ్రోజుల తర్వాత కూడా నల్ల కాగితాలు కరెన్సీగా మారలేదు. దీంతో మోసపోయామని భావించిన దంపతులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్లే కిడ్నీలు అమ్మేందుకు సిద్ధపడినట్లు పోలీసుల ఎదుట దంపతులు వాపోయారు. కాగా, బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.