రాజు డెడ్‌బాడీపై డౌట్.. చిన్నారి పేరెంట్స్ ఏం అంటున్నారంటే..
దిశ, డైనమిక్ బ్యూరో : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్ ఘన్‌పూర్ రాజారాం బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై తేలిన విషయం తెలిసిందే. పూర్తిగా ముఖం గుర్తుపట్టకుండా ఉండటంతో చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసి పోలీసులు రాజుగా గుర్తించారు. అయితే, దీనిపై చిన్నారి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తమ కళ్లతో చూసిన తర్వాతే నమ్ముతామని తేల్చిచెప్పారు. చాలా మంది టాటూలు వేయించుకుంటారని, మృతదేహాన్ని ఓ సారి సైదాబాద్‌కి తీసుకురావాలని […]
దిశ, డైనమిక్ బ్యూరో : సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్ ఘన్‌పూర్ రాజారాం బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై తేలిన విషయం తెలిసిందే. పూర్తిగా ముఖం గుర్తుపట్టకుండా ఉండటంతో చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసి పోలీసులు రాజుగా గుర్తించారు.
అయితే, దీనిపై చిన్నారి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తమ కళ్లతో చూసిన తర్వాతే నమ్ముతామని తేల్చిచెప్పారు. చాలా మంది టాటూలు వేయించుకుంటారని, మృతదేహాన్ని ఓ సారి సైదాబాద్‌కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అప్పుడే చనిపోయింది రాజేనని నమ్ముతామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
పోలీసులే చంపారు.. ‘రాజు’ భార్య మౌనిక సంచలన వ్యాఖ్యలు
ట్రాక్‌పై రాజు డెడ్ బాడీ.. ప్రత్యేక్ష సాక్షులు ఏం చెప్పారంటే..?