ఆ మాజీ ఎమ్మెల్యేకు ఆరు నెలల జైలు శిక్ష

దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యేకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే 2018  ఎన్నికల్లో గద్దల నాగేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా పాయం వెంకటేశ్వర్లు ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై అప్పట్లో కేసు నమోదైంది.  ఈ కేసులో కోర్టు విచారణ జరపగా ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేశాడనే అభియోగాలు రుజువైనట్లు ప్రజా ప్రతినిధుల కోర్టు వెల్లడించింది. దీంతో పాయం వెంకటేశ్వర్లుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల […]

Update: 2021-08-13 01:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యేకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే 2018 ఎన్నికల్లో గద్దల నాగేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా పాయం వెంకటేశ్వర్లు ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు విచారణ జరపగా ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేశాడనే అభియోగాలు రుజువైనట్లు ప్రజా ప్రతినిధుల కోర్టు వెల్లడించింది. దీంతో పాయం వెంకటేశ్వర్లుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో తనకు విధించిన రూ.10 వేల జరిమానాను మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు చెల్లించారు. అనంతరం జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు కోర్టును కోరారు. అనుమతించిన న్యాయస్థానం జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది.

Read More:

‘వెలుగు’ వాట్సాప్ గ్రూప్ లో సెక్స్ వీడియో కలకలం..

Tags:    

Similar News