ప్రారంభించి వదిలేశారు.. నిర్వహణ మరిచారు

రామవరం ప్రజల, వీధి వ్యాపారుల సౌకర్యార్ధం తెలంగాణ ప్రభుత్వం

Update: 2024-11-18 09:18 GMT

దిశ, కొత్తగూడెం : రామవరం ప్రజల, వీధి వ్యాపారుల సౌకర్యార్ధం తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్ల క్రితం పురపాలక సంఘం ఆధ్వర్యంలో, రామవరం సెంటర్లో మరుగుదొడ్లను నిర్మించి ప్రారంభించింది. లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన మరుగుదొడ్లు కేవలం ప్రారంభోత్సవానికి మాత్రమే పరిమితమయ్యాయి. మున్సిపాలిటీ సిబ్బంది మరుగుదొడ్లను కేవలం కొన్ని నెలల పాటే నిర్వహించారు.నిర్వహణ లోపం తో మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి.

అపరిశుభ్రంగా ఉండటంతో ప్రజలు,వీధి వ్యాపారులు, మహిళలు వీటిని వినియోగించడం లేదు. వివిధ పనులపై రామవరం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే మహిళలు, వీధి వ్యాపారాలు చేసుకుంటున్న మహిళలు, మహిళా పారిశుద్ధ్య కార్మికులు పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగంగా ఉండడం తో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రజాధనంతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను సక్రమంగా నిర్వహించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని రామవరం ప్రజలు కోరుతున్నారు.


Similar News