ఎన్‌కౌంటర్ మృతుల గుర్తింపు..

చత్తీస్ ఘడ్ నారాయణపూర్ జిల్లా, కాంకేర్ నార్త్ అబుజ్మద్ ప్రాంతంలో ఈ నెల 16 న జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలను పోలీస్ అధికారులు వెల్లడించారు.

Update: 2024-11-18 06:17 GMT

దిశ, భద్రాచలం : చత్తీస్ ఘడ్ నారాయణపూర్ జిల్లా, కాంకేర్ నార్త్ అబుజ్మద్ ప్రాంతంలో ఈ నెల 16 న జరిగిన ఎన్‌కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలను పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఐదుగురు మావోలు మృతిచెందగా వారి పై రు. 40 లక్షలు రివార్డ్ ఉన్నట్లు బస్తర్ ఐజీ సుందరరాజ్ పేర్కొన్నారు. డీకేసీఎం కమాండర్ వనోజా మిచా కరామ్, ప్లాటూన్ సభ్యుడు సంతోష్ కారచమి, మనేష్, సురేష్, పునీతలుగా గుర్తించారు. ఒక్కొక్కరిపై రు. 8 లక్షలు రివార్డ్ ఉన్నట్లు తెలిపారు. వీరంతా గతంలో అనేక విధ్వంసకర కార్యక్రమాలలో పాల్గొన్నారని, వీరి వద్దనుండి ఇంసాస్, సింగిల్ షాట్, 12 బోర్ -2, ఎస్బీఎల్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని పోలీస్ అధికారులు వెల్లడించారు.


Similar News