ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
దిశ,తల్లాడ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం తల్లాడ మండలంలో పర్యటించిన ఆయన సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు.
నేడు దళారులకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిల్లుల యజమానులతో చర్చలు జరపకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇప్పటికైనా కొనుగోళ్లు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ రెడెం మోహన్ రెడ్డి, దుగ్గిదేవర వెంకటలాల్, బద్దం కోటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.